ENGLISH

ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్.

14 August 2020-11:00 AM

ఎనర్జిటిక్ స్టార్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ లాస్ట్ సినిమా 'ఇస్మార్ట్ శంకర్' ఘన విజయం సాధించడంతో ఫుల్ గా ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' అనే సినిమాలో రామ్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. రామ్ తో గతంలో 'కందిరీగ' లాంటి సూపర్ హిట్ ఫిలిమ్ రూపొందించిన సంతోష్ శ్రీనివాస్ ఈ మధ్య రామ్ కు ఓ ఇంట్రెస్టింగ్ కథ వినిపించారట. కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు పచ్చజెండా ఊపారని, ఈ సినిమాను రామ్ పెదనాన్నగారు స్రవంతి రవి కషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించేందుకు రెడీ అయ్యారని సమాచారం.

 

ఈ సినిమా రామ్ స్టైల్ కి తగ్గట్టు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో 'అల్లుడు అదుర్స్' అనే ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దాదాపుగా చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా పూర్తి కాగానే రామ్ సినిమాపై సంతోష్ శ్రీనివాస్ వర్క్ చేయడం మొదలు పెడతారట.

ALSO READ: బాలయ్యకు ఆ విలన్ ను సెట్ చేసిన బోయపాటి