ENGLISH

శింబుతో జోడీ కట్టనున్న శృతి.

14 August 2020-10:00 AM

శృతి హాసన్ కొంత కాలం గ్యాప్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'క్రాక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇదిలా ఉంటే శృతి ఈ మధ్య ఓ కొత్త తమిళ సినిమాకు కూడా సంతకం చేసిందట. తమిళ హీరో శింబు హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ పాత్రకు శృతి ఓకే చెప్పిందని సమాచారం. యాక్షన్ హీరో విశాల్ తో 'డిటెక్టివ్' అనే విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు మిస్కిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు.

 

యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోందట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉందని, అందుకే శ్రుతి హాసన్ లాంటి హీరోయిన్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. స్టోరీ నచ్చడంతో శృతి హాసన్ ఈ సినిమాలో నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమానే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో కూడా శృతి ఒక కీలక పాత్రలో నటిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న 'లాబం' అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ALSO READ: Shruti Hassan Latest Photoshoot