ENGLISH

తొలిరోజే హెచ్ డీ ప్రింటు దించేశారు‌

27 March 2021-15:09 PM

నితిన్ - కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం `రంగ్ దే`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌లైంది. అయితే తొలి రోజే ఈ సినిమా పైర‌సీ బారీన ప‌డింది. త‌మిళ రాకర్స్ సైట్ ఈ సినిమా ని హెడీ క్వాలిటీని దించేసింది. నిజానికి త‌మిళ రాక‌ర్స్ పేరు చెబితే... త‌మిళ చిత్ర సీమ గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంది. త‌మిళ సినిమాల్ని పైర‌సీ చేయ‌డం, నిర్మాత‌ల్ని బ్లాక్ మెయిల్ చేయ‌డం వీళ్ల ప‌ని.

 

వీళ్ల దృష్టి తెలుగు సినిమాల‌పై ప‌డ‌దు. కానీ.. `రంగ్ దే`ని మాత్రం పైర‌సీ చేసేశారు. కాక‌పోతే.. ఇప్ప‌టి వ‌ర‌కూ `రంగ్ దే` నిర్మాత‌ల‌కు ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ కాల్స్ రాలేదు. నిర్మాత‌లు స్పందించి... ఆన్ లైన్ నుంచి.. రంగ్ దే సినిమాని తొల‌గించ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌మిళ్ రాక‌ర్స్ ని క‌ట్ట‌డి చేయాల‌ని త‌మిళ చిత్ర‌సీమ ఎంత‌గా ప్ర‌య‌త్నించినా స‌ఫ‌లం కాలేదు. ఇప్పుడు వాళ్ల దృష్టి... టాలీవుడ్ పైరా ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ALSO READ: రంగ్ దే.. తొలి రోజు వ‌సూళ్లు