ENGLISH

అఖిల్‌ కోసం రష్మిక వచ్చేస్తోందట.!

10 September 2020-16:00 PM

అక్కినేని అఖిల్‌, తన రియల్ స్టామినాకి తగ్గ సరైన హిట్‌ ఇంకా కొట్టలేదుగానీ.. ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్టులు మాత్రం సొంతం చేసుకుంటున్నాడు. సరైన హిట్టు ఒక్కటి వస్తే.. సూపర్బ్‌ స్టార్‌డమ్ అఖిల్‌ సొంతమవుతుందన్న అభిప్రాయం చాలామంది దర్శక నిర్మాతల్లో వుంది. అక్కినేని కాంపౌండ్‌లో డాన్సుల పరంగా అఖిల్‌ టాప్‌ అని అందరికీ తెలిసిందే. ఇక, ఇప్పుడు అఖిల్‌ సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో సినిమా కన్‌ఫామ్ చేసుకున్నాడు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తోన్న విషయం విదితమే. సినిమా అనౌన్స్‌మెంట్‌ ఇలా వచ్చిందో లేదో, అలా హీరోయిన్‌ గురించిన గాసిప్స్‌ షురూ అయ్యాయి.

 

అఖిల్‌ సరసన రష్మిక మండన్న పేరు ఖరారయ్యిందంటూ గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. అఖిల్‌ - రష్మిక కాంబినేషన్‌పై చాలా కాలంగా గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అవిప్పుడు నిజమయ్యేలానే వున్నాయి అయితే, రష్మిక చేతిలో వరుస సినిమాలున్నాయి. వాటి నుంచి రష్మిక ఎలా అఖిల్‌ కోసం డేట్స్‌ కేటాయిస్తుంది.? అన్నదే ప్రశ్న. ప్రస్తుతం అఖిల్‌, పూజా హెగ్దేతో ‘మోస్ట్‌ ఎలిబిజిల్‌ బ్యాచిలర్‌’ సినిమా కోసం ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తోన్న విషయం విదితమే.

 

ఈ కాంబినేషన్‌ని హాటెస్ట్‌ కాంబినేషన్‌గా టాలీవుడ్‌ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. రష్మిక - అఖిల్‌ కాంబినేషన్‌ ఖరారయితే, అది క్యూటెస్ట్‌ కాంబో అవుతుందనడం నిస్సందేహం. కాగా, ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌ని అఖిల్‌ కోసం టాలీవుడ్‌కి ఇంపోర్ట్‌ చేయబోతున్నారనే ప్రచారమూ జరుగుతోంది.

ALSO READ: బిగ్‌ హౌస్‌లో స్కెచ్‌ల మీద స్కెచ్‌లు బాబోయ్‌!