ENGLISH

రికార్డు బ‌ద్దలు కొట్టిన ర‌ష్మిక‌

01 November 2021-17:00 PM

క్రికెట్ లోనే కాదు, సినిమాల్లోనూ ఏం చేసినా రికార్డే. వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టించ‌డం మ‌న హీరోల‌కు బాగా తెలుసు. హీరోయిన్లు కూడా ఏం త‌క్కువ తిన‌లేదు. వాళ్లంతా సోష‌ల్ మీడియాలో కొత్త రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్నారు. తాజాగా ర‌ష్మిక ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ క‌థానాయిక అందుకోని ఫీట్ చేసింది. అదీ.. ఇన్ స్టాలో.

 

ర‌ష్మిక ముందు నుంచీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. వ్యక్తిగత విషయాలతోపాటు తన సినిమాలకు సంబందించిన అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటూ అభిమానుల‌కు ఎప్పుడూ ట‌చ్‌లో ఉంటోంది. దాంతో ఈ బ్యూటీకి నెట్టింట ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగిపోయారు. ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడికి 23.3 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక కేవలం 394 ఇన్ స్టా పోస్ట్ లతో 23 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ కూడా ఈ మైలు రాయిని చేరుకోలేక‌పోయింది. ఎవ‌రికీ ద‌క్క‌ని ఫీట్ ర‌ష్మిక చేజిక్కించుకుంది. అతి త‌క్కువ కాలంలో ఇంత మంది ఫాలోవ‌ర్స్‌ని సృష్టించుకోవ‌డం మామూలు విష‌యం కాదు. ఇది ర‌ష్మిక క్రేజ్‌కి నిద‌ర్శ‌నం.

ALSO READ: నాగ‌శౌర్య తండ్రికి పోలీసుల నోటీసులు