ENGLISH

ఫ్యాన్స్‌కి రష్మికా స్వీట్‌ వార్నింగ్‌.!

17 November 2018-11:34 AM

కన్నడ బ్యూటీ రష్మికామండన్నాపై అభిమానుల అంతులేని అభిమానం ఆ రేంజ్‌లో ఉంది మరి. తెలుగులో 'ఛలో' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్‌ మూవీకే ఓ మోస్తరు హిట్‌ కొట్టినా, రెండో సినిమా 'గీత గోవిందం'తో మాత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టేసింది. దాంతో అమ్మడిపై ఫోకస్‌ బాగా ఎక్కువైపోయింది. ఏం మాయ చేసిందో ఏమో తెలీదు కానీ, సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీకి పిచ్చ ఫాలోయింగ్‌ వచ్చేసింది.

ఆ ఫాలోయింగ్‌ కాస్త ఎంత దూరం వెళ్లిందంటే ఏకంగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌ పక్కన హీరోయిన్‌ని చేసేసింది. అవునండీ విజయ్‌ కొత్త సినిమాలో రష్మికా హీరోయిన్‌ అంటూ జోరుగా ప్రచారం చేసేసింది. దాంతో ఎట్టకేలకు రష్మికా స్పందించాల్సి వచ్చింది. నాపై మరీ అంత అంచనాలు పెంచేయ్‌కండి అంటూ అభిమానులకు క్యూట్‌గా స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. వాస్తవానికి డెబ్యూ హీరోయిన్స్‌కి కాస్త ఫేమ్‌ దక్కినా వారిపై ఈ తరహా రూమర్లు, గాసిప్స్‌ పుట్టడం సహజమే. అయితే హీరోయిన్స్‌ కూడా అలాంటి గాసిప్స్‌ని కొట్టి పారేయరు.

ఏమో టైం బాగుంటే ఆ గాసిప్సే కొన్నిసార్లు నిజమైనా కావచ్చు. కానీ రష్మికా సమ్‌థింగ్‌ స్పెషల్‌. అలాంటిదేమీ లేదు అంటూ ముందే క్లారిటీ ఇచ్చేసింది. దాంతో ఈ రకంగా కూడా ఆమె ఆటిట్యూడ్‌కి ఫిదా అయిపోయింది అభిమాన లోకం. ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ తెలుగులో విజయ్‌ దేవరకొండతో 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నటిస్తోంది. 'భీష్మ' చిత్రంలో యంగ్‌హీరో నితిన్‌తోనూ జోడీ కడుతోంది.

ALSO READ: యాక్షన్‌లోకి దిగిన 'రౌడీస్‌'