ENGLISH

Ravanasura: ఇదేం పాట రవితేజ ?

07 February 2023-11:08 AM

‘ధమాకా’తో ఓ మాస్ హిట్ కొట్టారు రవితేజ. ఇప్పుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు వచ్చింది. తాజాగా ఈ సినిమా థీమ్ సాంగ్ అంటూ ఒక పాటని విడుదల చేశారు. అయితే ఇది సినిమా పాటలా లేదు. పక్తు డీజే కొట్టుడు పాటిది. డీజే కన్సర్ట్ లో వాడే సౌండ్, బీట్ ని వాడి ఒకపాట చేశారు. థీమ్ సాంగ్ అంటే హీరో క్యారెక్టర్ గురించి ఏమైనా చెబుతారా ? సాహిత్యం ఏమైనా ఉంటుందా ? అనుకుంటే పొరపాటే. అసలు ఈ పాట కోసం సాహిత్యమే రాయలేదు. పబ్లిక్ డొమైన్ లో వుండే శివతాండంకు డీజే టచ్ ఇచ్చారు. దీంతో ఒరిజినాలిటీ కూడా దెబ్బ తినేసింది.

 

రవితేజ ధమాకా విజయంలో పాటలాదే ప్రధాన పాత్ర. మాస్ సాంగ్స్ అన్నీ ఒక ఊపు ఊపాయి. దీంతో రావణాసుర ఆల్బమ్ పై కూడా అంచనాలు పెరిగాయి. అన్నట్టు.. ఈ సినిమాకి హర్ష వర్షన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. ధమాకా విజయం తర్వాత బీమ్స్ ని కూడా ఈ ప్రాజెక్ట్ లో చేర్చారు రవితేజ. ఇప్పుడు వచ్చిన పాట రామేశ్వర్ చేసింది. భీమ్స్ చేసిన ఓ పాట వస్తే.. రావణాసుర ఆల్బమ్ మెరుస్తుందేమో..