ENGLISH

రవితేజ ఫ్యాన్స్ ఆగ్రహం, ధియేటర్ వద్ద అలజడి

18 October 2017-12:31 PM

మాస్ మహారాజ్ రవితేజ చాలా కాలం తరువాత నటించిన చిత్రం- రాజ ది గ్రేట్. ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది.

 

అయితే సూర్యాపేట్ లో రాజ ది గ్రేట్ చిత్రం ప్రదర్శిస్తున్న ఒక ధియేటర్ పై ఆగ్రహించిన రవితేజ ఫ్యాన్స్ సదరు ధియేటర్ లోని ఫర్నిచర్ ని ద్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే, స్థానికంగా ఉన్న తేజ ధియేటర్ యాజమాన్యం రాజ ది గ్రేట్ బెనిఫిట్ షో పేరిట టికెట్లు విక్రయించింది.

 

అయితే బెనిఫిట్ షో ప్రదర్శన ఆలస్యం కావడంతో ఆగ్రహించిన రవితేజ ఫ్యాన్స్ అక్కడ ఉన్న ఫర్నిచర్ పైన తమ ప్రతాపాన్ని చూపించారు. అనుకోని ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి వాతావరణం ఏర్పడింది.

 

ALSO READ: బాలయ్య సినిమాలో విలన్‌గా రాజశేఖర్‌!