ENGLISH

చిరు ఎందుకు క‌లిసిన‌ట్టు...??

07 March 2017-11:35 AM

మ‌హేష్ బాబు సెట్లో చిరంజీవి సంద‌డి చేయ‌డం...  అక్క‌డ కాసేపు స‌ర‌దాగా గ‌డిపి రావ‌డం టాలీవుడ్‌లో కొత్త హాట్ టాపిక్‌కి తెర లేచేలా చేసింది. మ‌హేష్ బాబు - మురుగ‌దాస్‌ల సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటోంది. అక్క‌డే మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు పోగ్రాంతో బిజీగా ఉన్న చిరు.. స‌డ‌న్ గా మ‌హేష్ సెట్లో అడుగుపెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచాడు.  స‌ర‌దాగా, షాట్ గ్యాప్‌లో స‌ర‌దాగా మురుగ‌దాస్ సెట్లో అడుగుపెట్టినా.. ఈ క‌ల‌యిక‌కు ప్ర‌త్యేక కార‌ణం ఉందని టాక్ వినిపిస్తోంది. మ‌రుగ‌దాస్ తో చిరు ఏకంతంగా మంత‌నాలు జ‌రిపాడ‌ని, త‌న కోసం ఓ క‌థ సిద్ధం చేయ‌మ‌ని అడిగాడ‌న్న టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు  పోగ్రాంకి మ‌హేష్ ని ఆహ్వానించ‌డానికి వెళ్లాడ‌ని.. త్వ‌ర‌లోనే ఈ షోలో మ‌హేష్ క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.