ENGLISH

'బాలకృష్ణుడు'తో రెజీనా సో హాట్‌!

03 November 2017-12:16 PM

నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'బాలకృష్ణుడు'. రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ పోస్టర్‌ విడుదలైంది. రెజీనా - నారా రోహిత్‌ జంటగా ఉన్న ఓ రొమాంటిక్‌ లుక్‌ అది. లుక్‌ అదిరిపోతోంది. ఈ లుక్‌లో నారా రోహిత్‌ చాలా స్లిమ్‌గా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం తొలిసారిగా నారా రోహిత్‌ సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేశాడు. సిక్స్‌ప్యాక్‌ బాడీతో సో హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో నారా రోహిత్‌ బాలకృష్ణుడుగా అలరించబోతున్నాడు. ఇక రెజీనా విషయానికి వస్తే ఈ సినిమాలో రెజీనా సో హాట్‌గా కనిపిస్తోంది. సినిమా మొత్తం ఇలాగే ఉంటుందట. అల్ట్రా మోడ్రన్‌ లుక్‌లో రెజీనా కనిపించబోతోందట. కథ చాలా కొత్తగా ఉంటుందంటున్నారు చిత్ర యూనిట్‌. అయినా నారా రోహిత్‌ సినిమాలంటేనే అంత. సరికొత్త కథలతో సరికొత్త కథాంశాలతో తెరకెక్కుతాయి. ఆయన ఎక్కువగా కథలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. తొలి సినిమా 'బాణం' నుండీ నిన్నటి 'కథలో రాజకుమారి' సినిమా వరకూ నారా రోహిత్‌ కథలన్నీ విభిన్నమైనవే. ఒకదానికొకటి అస్సలు సంబంధం ఉండవు. అలాగే ఈ 'బాలకృష్ణుడు' కూడా. ఇకపోతే రెజీనాకి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురానుందంటున్నారు. ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది రెజీనా. గతంలో 'జ్యో అచ్యుతానంద' సినిమాలో రెజీనా, నారా రోహిత్‌ కలిసి నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఆ సినిమాలో వీరిద్దరి పాత్రలూ డిఫరెంట్‌ యాంగిల్స్‌లో ఉంటాయి. ఈ సినిమాలో ఇద్దరిదీ రొమాంటిక్‌ పెయిర్‌ కానుందట. పోస్టర్స్‌ చూస్తుంటేనే ఎంతో ప్లెజెంట్‌గా రొమాంటిక్‌గా అనిపిస్తున్నాయి. సినిమా ఇంకా ప్లెజెంట్‌గా ఉంటుందట. ఇంకేం అచ్చమైన తెలుగు టైటిల్‌తో సరికొత్త లుక్‌లో వచ్చేస్తున్నాడీ 'బాలకృష్ణుడు'. ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెయిట్‌ అండ్‌ సీ!

 

ALSO READ: హీరో పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి