ENGLISH

అక్కడ కూడా రేణు దేశాయ్ ని విడిచిపెట్టడం లేదు

28 June 2018-17:43 PM

ఈమధ్యనే సోషల్ మీడియా అందులోనూ ప్రత్యేకంగా ట్విట్టర్ లో ఎక్కడ చూసినా నేగిటివిటీ తప్ప ఇంకేమి కనిపించడం లేదు అంటూ తన ట్విట్టర్ ఎకౌంటు ని డీయాక్టివేట్ చేసింది రేణు దేశాయ్.

తన నిశ్చితార్దం జరిగిన రోజు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులం అంటూ కొంత మంది ఆమె పైన సోషల్ మీడియా ని అడ్డం పెట్టుకుని తీవ్రంగా దూషిస్తుండడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఇన్స్టా గ్రామ్ లో యాక్టివ్ గానే ఉంటున్నది.

ట్విట్టర్ నుండి వెళ్ళిపోతే ఇక ఎవ్వరి బాధ ఉండదు అని అనుకున్న రేణుకి తాజాగా ఇన్స్టా గ్రామ్ లో సదరు అభిమానులు మళ్ళీ ఏవో ఏవో కామెంట్స్ పెడుతూ తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి ఘాటుగా స్పందించిన రేణు- అసలు నేను పవన్ కళ్యాణ్ నుండి విడాకులు ఎందుకు తీసుకున్నానో మీకు తెలిస్తే అప్పుడు మీరు మీ పొగరు మాటలు కొట్టుకుపోవాల్సిందే అని కుండబద్దలు కొట్టేసింది.

మరి ఈ రేంజ్ లో సమాధానం ఇచ్చాక కూడా మళ్ళీ రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

 

ALSO READ: తమిళ హీరో 'జై' కి పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..!