ENGLISH

రేణుదేశాయ్ కు తప్పని వేధింపులు

18 June 2024-15:40 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ ఇద్దరు పెళ్ళిచేసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఇది జరిగి చాలా సంవత్సరాలైంది. తరవాత ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ. పవన్ మళ్ళీ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు. అయినా ఇంకా పవన్ ఫాన్స్ రేణుదేశాయ్ ని వేధిస్తూనే ఉన్నారని రేణు దేశాయ్ తరచూ వాపోతోంది. పవన్ తో నా జీవితం ముగిసింది, నా బతుకు నేను బతుకుతున్నా ఇక నన్ను వదిలేయండి, నేను ఎం చేసినా పవన్ లైఫ్ తో ముడి పెట్టకండి, కంపేర్ చేయకండి అని పదే పదే వేడుకుంటూనే ఉంది. అయినా కానీ పవన్ ఫాన్స్ ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆమె చేసిన ప్రతి పోస్ట్ పై రక రకాల కామెంట్స్ చేస్తూ, రేణుని టార్చర్ పెడుతున్నారు. 


ఇప్పుడు కూడా ఒక నెటిజన్ రేణుపై అనుచిత కామెంట్స్ చేసాడు. 'వదిన గారు మీరు కొంతకాలం ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని వివాహం చేసుకుని ఆయన అంతరంగం తెలీయకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏదేమైనా విధి ప్రతిదీ డిసైడ్ చేస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు. అది చాలు వదిన. వీ ఆర్ మిస్సింగ్ యూ వదిన' అని సుధాకర్ అనే నెటిజెన్ కామెంట్ పెట్టాడు. దీంతో రేణు కూడా అతనికి స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. సుధాకర్ గారు మీకు కొంచెం అయినా బుద్ధి ఉందా. ఉంటే ఇలాగే చెప్తారా ? పవన్ ని వదిలేసింది నేను కాదు, తనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు అని రేణు రిప్లై పెట్టింది. 


తన ఇంట్లో హోమం, పూజ చేసినట్టు ఫొటోస్ పెట్టిన రేణుని నెటిజన్లు రక రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అన్న గెలిచినందుకే పూజలు చేశారా అని కొందరు, అన్న లేక పోయినా పూజలు చేస్తున్నారని ఇంకొందరు అడగ్గా 'మీరేం అనుకుంటున్నారు? నాకు నా సొంత లైఫ్ ఉండకూడదా? నేను ఏది చేసినా తనకోసమేనా? ఇలాంటి కామెంట్స్ తో మీరు నన్ను చాలా బాధ పెడుతున్నారు' అని పోస్ట్ చేసింది రేణు దేశాయ్.