ఆర్జీవీ నుండివెలువడిన తాజా సంచలనం- God, Sex & Truth. దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చానే నడుస్తున్నది, ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు ఈ వీడియో పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ అంశం పైన ఒక టీవీ ఛానల్ లో చర్చ జరిగింది.
ఈ చర్చలో దర్శకుడు ఆర్జీవీతో పాటు మహేష్ కత్తి, సామాజిక కార్యకర్తలు అయిన దేవీ, ఒక 10 మంది యువతులు పాల్గొనడం జరిగింది. ఇక ఈ డిబేట్ చాలా హాట్ హాట్ గా జరిగింది అనే చెప్పొచ్చు. సామాజిక కార్యకర్త అయిన దేవీ అయితే ఆర్జీవీ వీడియో ఒక చెత్త అని అభివర్ణించగా ఆయన మాత్రం తాను ఈ వీడియో తీసింది కేవలం ఆడవాళ్ళ గౌరవం పెంచే విధంగానే అని ఆయన తన చర్యని సమర్ధించుకున్నారు.
ఇక ఈ షోలో పాల్గొన్న యువతులు మాత్రం- ఈ వీడియో పై తమకి ఉన్న అభ్యంతరాలు, ప్రశ్నలు అలాగే ఆర్జీవీ పైన కొన్ని ప్రశ్నలు సందించారు. ఒక అమ్మాయి అయితే ఆర్జీవీని ఒక క్రేజీ ఫ్రాగ్ అంటూ అనడం ఈ డిబేట్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
ఆఖరిగా మహేష్ కత్తి కూడా ఈ వీడియో విషయంలో ఆర్జీవీని సమర్దించడమే కాకుండా ఈ వీడియో తప్పక ఒక కొత్త అధ్యాయానికి తెర తీస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ALSO READ: వివాదంలో చిక్కుకున్న వర్మ ‘GST’