ENGLISH

బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్మిన వ‌ర్మ‌

08 August 2020-13:49 PM

అంద‌రిపై సెటైర్లు వేసి, వాళ్ల జీవితాల్ని వెండి తెర‌పైకి లాక్కొచ్చి, దాంతో ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం రాంగోపాల్ వ‌ర్మ‌కి అల‌వాటు. ఎవ‌రిపై కోపం వ‌చ్చినా వ‌ర్మ సినిమా తీసేస్తాడు. మ‌రి వ‌ర్మ‌పై కోపం వ‌స్తే..?  దానికీ సినిమానే మార్గం. టాలీవుడ్ లో ప్ర‌స్తుతం వ‌ర్మ సినిమాలు, వ‌ర్మ‌పై తీస్తున్న సినిమాలూ అంటూ రెండు ర‌కాల జోన‌ర్లు త‌యార‌య్యాయి. ఇటీవ‌ల వ‌ర్మ‌పై `పరాన్న జీవి` అనే సినిమా వ‌చ్చింది. జొన్న విత్తుల `ఆర్జీవీ` అంటూ ఓ సినిమా తీస్తున్నారు. ఇప్పుడు `రాడ్ గోపాల్ వ‌ర్మ‌` అనే మ‌రో సినిమా త‌యార‌వుతోంది.


కె.ఎస్‌.మ‌ణి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఫ‌స్ట్ లుక్‌పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. ఓ పోలీస్ స్టేష‌న్ లో వ‌ర్మ‌ని పోలిన వ్య‌క్తి.. న‌గ్నంగా కూర్చుని ఉన్న స్టిల్ బ‌య‌ట‌కు వ‌దిలారు. అప్ప‌ట్లో వ‌ర్మ‌. పంజాగుట్ట లో సీడీ షాపు న‌డిపేవాడు. ఇది అప్ప‌టి క‌థ అన్న‌ట్టు తెలుస్తోంది. `ప‌లు బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్ముతున్న యువ‌కుడిని అరెస్టు చేసిన పోలీసులు` అనే పేప‌ర్ క‌టింగ్ కూడా జోడించారు. మొత్తానికి వ‌ర్మ‌..ని  టార్గెట్ చేస్తూ ఓ ఇంట్ర‌స్టింగ్ పోస్ట‌ర్ అయితే వ‌దిలారు. మ‌రి సినిమా ఎలా ఉంటుందో?

ALSO READ: క‌థ‌లు రాస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌