ENGLISH

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మేజర్‌ హైలైట్‌ అదేనా.!

03 September 2020-09:00 AM

రాజమౌళి సినిమా అనగానే యాక్షన్‌ సీక్వెన్సెస్‌ని ఓ రేంజ్‌లో ఆశిస్తుంటారు అభిమానులు. అందుకే, ఆ అంచనాలకు తగ్గట్టే అత్యద్భుతమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని రాజమౌళి ప్లాన్‌ చేస్తాడు. మరి, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి సంబంధించి యాక్షన్‌ ఎపిసోడ్స్‌ మాటేమిటి.? అంటే, ‘అంతకు మించి’ అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఇద్దరు హీరోలున్నారు. ఒకర్ని మించి ఇంకొరు స్టార్‌డవ్‌ు పరంగా పోటీ పడతారు.

 

మరి, ఇద్దరి కోసం కనీసం రెండు వేర్వేరు యాక్షన్‌ ఎపిసోడ్స్‌.. రాజమౌళి స్థాయిలో వుండాలి కదా.! ఆ రెండిటిలో ఒకటి ట్రెయిన్‌ ఎపిసోడ్‌ అన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. సుమారు 30 రోజులపాటు షూట్‌ చేస్తారట ఈ ట్రెయిన్‌ ఎపిసోడ్‌ కోసం. అయితే, ఇద్దరు హీరోలూ ఈ ఎపిసోడ్‌లో వుంటారా.? ఒక్కరే కన్పిస్తారా.? ఒక్కరే అయితే ఆ ఒక్కరూ ఎవరు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ‘మగధీర’ సినిమా కోసం 100 మందితో హీరో పోరాడే సన్నివేశాన్ని రాజమౌళి ఏ స్థాయిలో చిత్రీకరించాడో చూశాం. అంతకు మించి.. అనే స్థాయిలో వుండబోతోందట ఈ ట్రెయిన్‌ ఎపిసోడ్‌.

 

హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ సన్నివేశం చిత్రీకరిస్తారనీ, ‘స్కెచ్‌’ రెడీ అయిపోయినా, కరోనా నేపథ్యంలో ఆ సన్నివేశం చిత్రీకరణకు కొంత సమయం పడుతుందని అంటున్నారు. ఇది కాకుండా మరో రెండు కీలక సన్నివేశాలు.. అవీ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఈ సినిమాకి అదనపు హైలైట్స్‌గా నిలుస్తాయన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారం. బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ఈ సినిమాలో రావ్‌ుచరణ్‌ సరసన నటిస్తున్న విషయం విదితమే.

ALSO READ: శ‌ర్వాతో.. చ‌ర‌ణ్ బంధుత్వం క‌లుపుకుంటున్నాడా?