ENGLISH

'ఆర్‌ఆర్‌ఆర్‌' లీకులు మొదలయ్యాయ్‌.!

23 November 2018-12:28 PM

మెగా మల్టీ స్టారర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా కోసం వేసిన ఓ సెట్‌ తాలూకు ఫోటోలు బయటికి వచ్చాయి. ఎంత పగడ్బంధీగా షూటింగ్‌ స్పాట్‌లో జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఫోటోలు బయటికి రావడంతో నిర్మాత డివివి.దానయ్య, డైరెక్టర్‌ రాజమౌళి అలర్ట్‌ అయ్యారు. 

లొకేషన్స్‌లో మరింతగా నిఘా పెంచారట. మామూలుగానే రాజమౌళి సినిమాలకు షూటింగ్‌ స్పాట్‌లో నిఘా కాస్త ఎక్కువగానే ఉంటుంది. చిత్ర యూనిట్‌లో సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల యూజింగ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. అలాంటిది ఆదిలోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌'ని ఇలా లీకేజీ వ్యవహారం వణికిస్తోంది. అంతేకాక లీకైన ఫోటోల్లా కనిపిస్తున్న ఈ సెట్‌లోనే సినిమాకి సంబంధించిన అత్యంత ఇంపార్టెంట్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారనీ తెలుస్తోంది. అసలే రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన కథ, ఇతర విషయాలన్నింట్లోనూ తన గత చిత్రాలతో పోలిస్తే ఎక్కువ గోప్యత పాఠిస్తున్నాడు. 

అలాంటిది లీకేజీ బాగోతం ఆదిలోనే వెంటాడిందంటే జక్కన్న ఇంకెంత జాగ్రత్త పడాల్సి ఉందో. మొన్నీ మధ్యన ఎన్టీఆర్‌ నటించిన 'అరవింద సమేత' చిత్రాన్ని లీకేజీ వైరల్‌ ఎంతగా బాధించిందో తెలిసిన సంగతే. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' చిత్రం ఫుల్‌ డిజిటల్‌ వీడియో బయటికి వచ్చేసింది. ఎలాగోలా ఆ సినిమా విడుదలైందనుకోండి అది వేరే విషయం. 

చూస్తుంటే 'ఆర్‌ఆర్‌ఆర్‌'నీ ఈ లీకేజీ బూతం వదిలేలా లేదు మరి. చరణ్‌ - ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మరింత ఆశక్తి, ఉత్కంఠ ఉండడం సహజమే. అయితే విడుదలకు ముందే సినిమా లీకులంటే చిత్ర యూనిట్‌ని మరింత బాధిస్తోంది.

ALSO READ: ముద్దుగుమ్మ ముద్దుల సినిమా ఏమవుతుందో.?