ENGLISH

'ఆర్‌ఆర్‌ఆర్‌' టైటిల్స్‌ పోటెత్తాయి.!

01 May 2019-12:27 PM

'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకి ఓ వైపు హీరోయిన్‌ వేట కొనసాగుతుండగానే, మరోవైపు టైటిల్‌ సునామీ నడుస్తోంది. రాజమౌళి గతంలోనే చెప్పారు. ఈ సినిమాని పలు ఇండియన్‌ భాషల్లో విడుదల చేస్తున్నామనీ, అన్నింట్లోకీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' కామన్‌గా ఉంటుందనీ, అయితే ఒక్కో భాషలో ఒక్కో టైటిల్‌ ఉంటుందనీ చెప్పారు. టైటిల్స్‌ కోసం యూనిట్‌ పెద్దగా కష్టపడకుండా, ఆ బాధ్యతను అభిమానుల మీదే ఉంచారు. ఆ బాధ్యతను శిరసా వహించిన అభిమానులు తమదైన శైలిలో పలు రకాల టైటిల్స్‌ని డిజైన్స్‌తో సహా పంపించేశారు.

 

'రవి చూడని రామ రావణ రణ రంగం', 'రైజ్‌ రోర్‌ రివోల్ట్', 'రివల్యూషన్‌ ఆఫ్‌ రామరాజు', 'రామరాజ్య రక్షకా', 'రమ్‌ రుధిరమ్‌', 'రామరాజు రాజసం', 'రాజసం రాక్షసం రావణం'. 'రంగస్థలంలో రణరంగం'.. అంటూ ఇలా ఫ్యాన్స్‌ నుండి వచ్చిన పలు టైటిల్స్‌ని 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రొడక్షన్‌ సంస్థ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇంకా పంపించమని కోరింది. ఇలా తెలుగులోనే కాదు, తమిళంలోనూ, హిందీలోనూ, మలయాళ తదితర భాషల్లో టైటిల్స్‌ పోటెత్తుతున్నాయి. అయితే కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ జక్కన్న వీటిలో ఏ టైటిల్‌ని ఏ భాషకు ఫైనల్‌ చేస్తారో చూడాలిక. అయితే రాజమౌళి విసిరిన ఈ టైటిల్‌ సవాల్‌ మాత్రం ఫ్యాన్స్‌లో భలే ఉత్సాహాన్ని నింపింది. తమ తమ మెదడుకు పదును పెట్టి, తమ అభిమాన హీరోల సినిమా కోసం బెస్ట్‌ టైటిల్‌ని అందించేందుకు మరింత ఆశక్తి చూపిస్తున్నారు.

ALSO READ: జూ.ఎన్టీఆర్‌.. రియల్‌ హీరో: నిధి అగర్వాల్