ENGLISH

'ఆర్ఆర్ఆర్‌' జోరు మీదుంది.!

07 December 2018-11:43 AM

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో మెగా మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్‌' చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని రాజమౌళి ధృవీకరిస్తూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. ఈ షెడ్యూల్‌లో ఓ యాక్షన్‌ సీన్‌ చిత్రీకరించినట్లుగా సమాచారమ్‌ అందుతోంది. అయితే షూటింగ్‌లో ఎన్టీఆర్‌, చరణ్‌ పాల్గొన్నారా.? లేదా.? అనే విషయంపై క్లారిటీ లేదు కానీ, ఎన్టీఆర్‌, చరణ్‌లపైనే ఈ యాక్షన్‌ సీన్‌ చిత్రీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌.

 

ఏది ఏమైనా మామూలుగా అయితే రాజమౌళి సినిమాలు చాలా లేట్‌గా చిత్రీకరణ జరుగుతాయి. కానీ 'ఆర్ఆర్ఆర్‌' విషయంలో కాస్త దూకుడుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం సన్నాహాలు చేయనున్నారట. విదేశాల్లో నెక్ట్స్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం చరణ్‌, ఎన్టీఆర్‌లతో చర్చలు జరుగుతున్నాయట. చరణ్‌ ప్రస్తుతం 'వినయ విధేయ రామ' ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సి ఉంది.

 

సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ తర్వాత ఫుల్‌ ఫ్లెడ్జ్‌డ్‌గా రాజమౌళికి తన టైం కేటాయించనున్నాడట. 'బాహుబలి'ని దాదాపు ఐదేళ్ల పాటు చిత్రీకరించిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్‌'ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నాడట. ఇప్పటికే పక్కాగా గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేసి, రంగంలోకి దిగాడు. కాబట్టి, జక్కన్న చెప్పినట్లే ఈ సినిమాని వీలైనంత త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూర్చుతుండగా, డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 

ALSO READ: తెలంగాణ ఎలక్షన్‌ అప్‌డేట్స్‌: హేట్సాఫ్‌ సెలబ్రిటీస్‌