ENGLISH

రికార్డుల వేట మొద‌లెట్టిన RRR

25 March 2021-14:00 PM

రాజ‌మౌళి సినిమా అంటేనే రికార్డుల వేట‌. ఆయ‌న `ఈగ‌`తో సినిమా తీసినా - బాక్సాఫీసు ద‌గ్గ‌ర సంచ‌ల‌న‌మే. అలాంటిది ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ చేస్తే - ఆ హంగామా మామూలుగా ఉంటుందా? రికార్డుల‌న్నీ బ్రేక్ అయిపోతాయి. బాక్సాఫీసు షేక్ అయిపోతుంది. RRR విష‌యంలో అదే జ‌రుగుతోంది. ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టించిన చిత్ర‌మిది. అక్టోబ‌రు 13న విడుద‌ల అవుతోంది.

 

ఈలోగా ప్రీ రిలీజ్ బిజినెస్ హంగామా మొద‌లైపోయింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీల‌లో ఒకేసారి ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నారు. అన్ని భాష‌ల నుంచి దాదాపుగా 350 కోట్ల బిజినెస్ జ‌రిగింద‌ని టాక్‌. సినిమా బ‌డ్జెట్ మొత్తం.. ఈ 5 భాష‌ల థియేట‌రిక‌ల్ రైట్స్ తో తిరిగి వ‌చ్చేసింది. ఇక శాటిలైట్, ఓటీటీ రైట్స్ ఉన్నాయి. అందునిమిత్తం మ‌రో 250 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అదంతా.. లాభం అనుకోవాలి.

ALSO READ: 'రంగ్ దే'.... ప్రీ రిలీజ్ అదిరింది!