ENGLISH

జాగ్రత్తపడ్తున్న సుప్రీం హీరో

13 March 2017-17:59 PM

సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ జాగ్రత్తపడుతున్నాడు. ఇకపై చేయబోయే సినిమాలన్నీ బడ్జెట్‌ పరంగా 'కన్వీనీయెంట్‌' అవ్వాలని అనుకుంటున్నాడట. 'విన్నర్‌' సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ వచ్చినా, ఆ సినిమా తాను ఆశించిన స్థాయి విక్టరీ సాధించకపోవడంతో ఈ యంగ్‌ హీరో పునరాలోచనలో పడ్డాడని సమాచారమ్‌. 'సుప్రీం' సినిమాని మించి వసూళ్లు వస్తాయని, రికార్డు విజయం తన ఖాతాలో పడుతుందని సాయిధరమ్‌ అంచనా వేశాడు. అయితే ఆ స్థాయి అంచనాలను అందుకోలేకపోయింది 'విన్నర్‌'. ఓకే అనిపించుకున్న ఈ చిత్రం ఫలితం తర్వాత సాయిధరమ్‌లో చాలా మార్పులు వచ్చాయని సన్నిహితులు అంటున్నారు. బడ్జెట్‌ పరంగా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లిమిటెడ్‌ బడ్జెట్‌లో అద్భుతాలు సాధించవచ్చునని సాయిధరమ్‌ తన దర్శకులకు నిర్మాతలకు చెబుతున్నాడట. డైరెక్టర్స్‌తోనూ, ప్రొడ్యూసర్స్‌తోనూ ఫ్రెండ్లీగా ఉండే సాయిధరమ్‌ తన సినిమాకి సంబంధించి అన్ని విషయాల్లోనూ తనవంతు జాగ్రత్తలు తీసుకుంటాడు. 'తిక్క' పరాజయం, 'విన్నర్‌' ఓకే అనిపించుకున్నా అంచనాల్ని అందుకునే వసూళ్ళు రాకపోవడంతో సాయిధరమ్‌ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అభినందించదగ్గదే. ఈ మెగా హీరో ప్రస్తుతం 'జవాన్‌' సినిమాలో నటిస్తున్నాడు.

 

ALSO READ: వర్మకేంటి, ఎవరికైనా ఏడుపొచ్చేస్తుంది!