ENGLISH

డైరక్ష‌న్‌పై మ‌న‌సు విప్పిన స్టార్ రైట‌ర్‌

05 March 2021-09:31 AM

ర‌చ‌యిత‌లంతా మెగా ఫోన్ ప‌ట్టాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటారు. ఈమ‌ధ్య వాళ్ల హ‌వానే ఎక్కువ‌. ద‌ర్శ‌కులుగా మారిన ర‌చ‌యిత‌లంతా మంచి హిట్లుకొడుతున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్‌రైటర్ గా కొన‌సాగుతున్న బుర్రా సాయి మాధ‌వ్ కూడా త్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నంద‌మూరి బాల‌కృష్ణ కోసం ఓ క‌థ రాస్తున్నార‌ని, ఓ స్టార్ హీరోయిన్ తో లేడీ ఓరియెంటెడ్ చేయ‌బోతున్నార‌ని టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వీటిపై బుర్రా సాయిమాధ‌వ్ స్పందించారు.

 

``నేను రాయాల్సిన క‌థ‌లు చాలా ఉన్నాయి. చాలామంది దర్శ‌కుల ద‌గ్గ‌ర ప‌నిచేయాలి. వాళ్ల స్కూల్ లో విద్యార్థిని కావాలి. ఆ త‌ర‌వాతే డైర‌క్ష‌న్‌. నాక్కూడా ఓ క‌థ, నాలా చెప్పాల‌ని అనిపించాలి. ఆ క‌థ నా మ‌న‌సులోంచి పుట్టాలి. అప్పుడే నేను ద‌ర్శ‌క‌త్వం గురించి ఆలోచిస్తా`` అన్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న ర‌చ‌యిత కూడా బుర్రానే. ఆయ‌న పారితోషికం సినిమాకి కోటి వ‌ర‌కూ ఉంటుంద‌ని టాక్‌. ప్ర‌స్తుతం శ్రీ‌కారం సినిమాకి మాట‌లు రాశారు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`కీ ఆయ‌నే సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌.

ALSO READ: త‌ల్లి కాబోతున్న స్టార్ సింగ‌ర్‌