బాలీవుడ్ స్టార్ డైరక్టర్ నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామాయణం' షూటింగ్ మొదలయ్యింది. ఈ మూవీ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఎలాంటి న్యూస్ వచ్చినా నిముషాల్లో వైరలవుతోంది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ రామాయణం లో భారీ తారాగణం ఉంది. అన్ని భాషలకి చెందిన నటీ నటులు ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే కొంత కాస్టింగ్ ఫైనల్ అయ్యారు. రాముడిగా రణభీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణ్ గా యశ్, శూర్పనఖగా రకుల్, దశరథ్‌గా అరుణ్ గోవిల్, లారా దత్తా కైకేయిగా నటిస్తున్నారు. విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించాల్సి ఉండగా క్యాన్సిల్ అయ్యింది. మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం 750 కోట్లు ఖర్చు చేయనున్నారని టాక్. ఈ బడ్జెట్ లో సగం స్టార్ల రెమ్యునరేషన్లకే పోతున్నాయి.
యానిమల్ సినిమా తరవాత రణబీర్ మార్కెట్ రేంజ్ పెరిగింది. దానితో రామాయణం లో నటించటానికి రణబీర్ కపూర్ ఒక్కో పార్ట్ కి 75 కోట్లు తీసుకుంటున్నాడు. అంటే మూడు భాగాలకి కలిపి 225 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. కేజిఎఫ్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న యశ్ కి కూడా మార్కెట్ ఉంది. అందుకనే రామాయణంలో రావణుడి పాత్రకోసం యశ్ ఒక్కో పార్ట్ కి 50 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. మూడు భాగాలకి కలిపి 150 కోట్లు తీసుకుంటున్నాడు. సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి 6 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. ఇప్పటివరకు సాయి పల్లవి తీసుకున్న హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇదే కావటం గమనార్హం. రామాయణానికి ముందు సాయి పల్లవి పారితోషికం 3 కోట్లు ఉండేది. రామాయణంతో డబల్ పారితోషికం అందుకొంటోంది. త్రీ పార్ట్స్ కి కలిపి సాయి పల్లవికి దాదాపు 20 కోట్ల రూపాయలు ముట్టనుంది.
రామాయణంలో ఈ మూడు కీలక పాత్రలు రెమ్యూనరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. వీరికే ఇంత రెమ్యునరేషన్ పొతే, మిగతా నటీనటులకి ఇంకెంత ఉంటుందో అని పలువురి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు రణభీర్ కపూర్ రామాయణం షెడ్యూల్‌లో పాల్గొంటారని, సాయి పల్లవి , యష్ జూలైలో సెట్ లో అడుగు పెడతారని సమాచారం. అయోధ్యలో రామాయణం కోసం 11 కోట్ల రూపాయల బడ్జెట్ తో సెట్ నిర్మించారు.