ENGLISH

చరిత్ర సృష్టించిన కీరవాణి

10 April 2024-14:40 PM

ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోంది. సినీ పరిశ్రమలో కూడా వీటి ఉపయోగం మొదలయ్యింది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో కాలం చేసిన గాయనీ గాయకుల వాయిస్ ని రీ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా కీడా కోలా మూవీలో SPB వాయిస్ ని ఇలానే క్రియేట్ చేశారు. రజనీకాంత్ 'లాల్ సలామ్‌'లో ఒక ట్రాక్ కోసం దివంగత గాయకులు బాంబా బాక్యా - షాహుల్ హమీద్ స్వరాలను క్రియేట్ చేశారు AR రెహమాన్ . నాని న‌టించిన‌ 'హాయ్ నాన్నా'లో ఒక పాట కోసం హేషమ్ అబ్దుల్ వహాబ్ AI టెక్నాలజీని ఉపయోగించారు. తొందరలోనే హీరోయిన్స్ ని కూడా AI టెక్నాలజీ తో క్రియేట్ చేస్తామని కొందరు హింట్ ఇచ్చారు. త్రివిక్రమ్ బన్నీతో చేయబోయే సినిమాలో AI హీరోయిన్  ఉంటుందని ప్రచారం జరిగింది.        


అయితే ఇప్పటివరకు పాత పాటల్ని ఇలా AI టెక్నాలజీ ఉపయోగించి రీ క్రియేట్ చేశారు. కానీ ఆస్కార్ విన్నర్ కీర‌వాణి కొత్త పాటని AI తో పాడించి రికార్డ్ క్రియేట్ చేశారు. కీరవాణి ప్రజంట్ 'లవ్ మీ' సినిమాకి వర్క్ చేస్తున్నారు. ఈ మూవీలో ఆశిష్ రెడ్డి - వైష్ణవి చైతన్య లు జంటగా నటిస్తున్నారు. ఈ మూవీలో కీరవాణి మొత్తం ఏడు పాటల్ని స్వరపర్చగా,  ఒక సాంగ్ మొత్తం కంపోజ్ చేయడానికి  AIని ఉపయోగించారని, అంతే కాక ఆ పాటని AI తోనే పాడించినట్టు సమాచారం. ఇలా కొత్త పాటని AI  తో పాడించిన ఘనత కీరవాణికి దక్కిందని, AI పాట పాడించిన తొలి తెలుగు సంగీత దర్శకుడిగా కీరవాణి చరిత్రలో నిలిచిపోతారని లవ్ మీ ఆడియో ఆవిష్కరణలో దిల్ రాజు పేర్కొన్నారు. 


దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ రొమాంటిక్ హారర్ అని తెలుస్తోంది. ఈ మూవీ తో అరుణ్ అనే కొత్త డైరక్టర్  పరిచయం అవుతున్నారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. హర్షిత్ రెడ్డి, హన్సితారెడ్డి, నాగ మల్లిడి నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25 న  థియేటర్స్ లో సందడి చేయనుంది.