ENGLISH

2025 సంక్రాంతి బరిలో మాస్ మహా రాజా

09 April 2024-16:40 PM

మాస్ మహా రాజా రవితేజ కెరియర్ కొంచెం డౌన్ అయ్యింది. వరస సినిమాలు చేస్తూ వస్తున్నా సక్సెస్ రేట్ తక్కువ ఉంది ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే అరడజను సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ టైగర్ నాగేశ్వర రావ్ డిజాస్టర్ మూటగట్టుకుంది. ఈ ఏడాది ఈగల్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాతి బరిలో దిగాల్సిన ఈగల్ వాయిదా వేసుకుని సోలోగా  బరిలో దిగింది. అయినా అంతగా మెప్పించ లేకపోయింది. ఇలాంటి టైం లో రవి తేజ కి ఒక హిట్ పడాల్సిందే. లేదంటే రవి తేజ కెరియర్ ఆందోళనలో పడిపోతుంది. మార్కెట్ లేని కారణంగా నిర్మాతలు కూడా  వెనకంజ వేయాల్సి వస్తుంది. ప్రజంట్ రవి తేజ హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. హిందీలో అజయ్ దేవగన్, ఇలియానా నటించిన రైడ్ మూవీకి ఇది రీమేక్. 


నెక్స్ట్ రవి తేజ 'సామజవరగమన' మూవీ రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఒక సినిమా కమిట్ అయినట్టు సమాచారం. సామాజవరగమనా మూవీ ఎంత ఫన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చి వసూళ్ల  పరంగా కూడా ది బెస్ట్ అనిపించుకుంది. అలాంటి రచయితకి రవి తేజ తనని డైరక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇది మాస్ మహారాజ్ కి 75 వ సినిమా కావటం విశేషం. ఉగాది సందర్భంగా ఈ న్యూస్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సితార  ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.


రవితేజ 75వ సినిమా అని తేలిసేలా కళ్ళద్దాల మీద RT 75 రాశారు. అంతే కాదు "రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి".. "హ్యాపీ ఉగాది రా భయ్" అని మేకర్స్ తెలంగాణ యాసలో చెప్పి ఈ సినిమాలో రవితేజ తెలంగాణ మాండలికం లో మాట్లాడనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ కథ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని, రవితేజ లక్ష్మణ భేరిగా నటిస్తున్నాడని మేకర్స్ వెల్లడించారు. రవి తేజ క్యారెక్టర్ ని ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. "ఆదాయం: చెప్పను తియ్, ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్య పూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో" అంటూ రవితేజ రోల్ గురించి వైరైటీ గా పరిచయం చేసారు మేకర్స్. రవి తేజ కి ఈ సినిమా అయినా మంచి హిట్ ఇస్తుందేమో చూడాలి.