ENGLISH

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బన్నీ

09 April 2024-16:17 PM

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రానున్న పుష్ప ది రూల్ కోసం వరల్డ్ వైడ్ గా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీల్లో పుష్ప 2 ఒకటి. మొదటి పార్ట్ ‘పుష్ప ది రైజ్’ సంచలనం విజయం సాధించింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. పుష్ప రాజ్ మ్యానరిజానికి అంతా ఫిదా అయిపోయారు. నేషనల్ అవార్డు కూడా సాధించాడు. పుష్ప 2 ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. పుష్ప ది రూల్  ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. గ్లింప్స్, రిలీజ్ అయిన పోస్టర్స్ భారీ అంచనాలను పెంచాయి. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ప్రజంట్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది.


నిన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన టీజర్ 24 గంటల్లో 85 మిలియన్స్ కి పైగా రియల్ టైం వ్యూస్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు 1.2 మిలియన్స్ కి పైగా లైక్స్ తో  యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది. తగ్గేదేలే అన్నట్టు పుష్పరాజ్ తన హవా కొనసాగిస్తున్నాడు. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొందని సమాచారం. కేవలం నైజాం హక్కుల కోసం 100 కోట్ల డిమాండ్ ఉన్నట్లు టాక్. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి 300 కోట్ల మార్క్ దాటొచ్చని ట్రేడ్ పండితుల ఆలోచన.