ఫ్యామిలీ స్టార్ మూవీతో ఆడియన్స్ ని మెప్పించిన విజయ్ దేవర కొండ నెక్స్ట్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా ముందునుంచి అనుకున్న కథే, విజయ్ ఫ్యామిలీ స్టార్ కంటే ముందే కమిట్ అయిన సినిమా. ఇందులో శ్రీ లీల ని హీరోయిన్ గా ఫిక్స్ చేసి అఫీషియల్ గా పూజా కార్య క్రమాలు నిర్వహించారు. ఎందుచేతనో విజయ్ ఫ్యామిలీ స్టార్ పై ఇంట్రస్ట్ చూపించటంతో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ లేట్ అయ్యింది. దీనితో ఇప్పుడు శ్రీలీల డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ మూవీ నుంచి తప్పుకుంది.
శ్రీలీల ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారు అని అంతా అనుకుంటున్న టైంలో ఇప్పుడు మలయాళ బ్యూటీ పేరు వినిపిస్తోంది. ప్రేమలు అనే మాలయాళ డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్ళ గుండెల్లో కలవరాన్ని రేపింది మమిత బైజు. జక్కన్న లాంటి డైరక్టర్ మమిత బైజు యాక్టింగ్ కి ఫిదా అయిపోయాడు. ప్రేమలు సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన మమిత బైజు ఇప్పుడు కొండన్న కి జోడి గా నటించనుందని టాక్. వీరిది ఫ్రెష్ జోడి గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట.
ఇదే కనకే నిజమైతే మమితా బైజు టాలీవుడ్ లో పాగా వేయటం ఖాయం. ప్రేమలు లాంటి చిన్న సినిమాతో గుర్తింపు తెచ్చుకుని, తన క్యూట్ ఎక్సప్రెషన్స్ తో అందరిని మెస్మరైజ్ చేసిన మమితా టాలివుడ్ లో ఏకంగా విజయ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఈ ఛాన్స్ తో మమితా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకోనే ఛాన్స్ ఉంది. మమిత ఇప్పటికే తమిళం లో కొన్ని సినిమాలు ఓకే చేసినట్టు సమాచారం. త్వరలోనే పాన్ ఇండియా హీరోయిన్ అయినా ఆశ్చర్య పోనవసరం లేదు.