ప్రజంట్ నడుస్తున్న పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా సినీ నిర్మాణం వ్యయం బాగా పెరిగిపోతోంది. ఒకప్పుడు సౌత్ లో బడా స్టార్స్ సినిమాలు కూడా మీడియం రేంజ్ బడ్జెట్ తో రూపొందేవి. కానీ ఇప్పుడు అలా కాదు బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయి. నిన్న కాక మొన్న వచ్చిన హీరోల సినిమాలకి కూడా భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు వెనకాడటం లేదు. హీరోలు రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గటం లేదు. ఒకప్పుడు లక్షల్లో తీసుకునే వాళ్ళు ఇప్పుడు వందల కోట్లు తీసుకుంటున్నారు. రీసెంట్ గా విశ్వంభర మూవీతో సౌత్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్గా త్రిష రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పడు కోలివుడ్ స్టార్ దళపతి విజయ్ ఏకంగా రజని కాంత్ నే బీట్ చేసాడు.
రజనీ కాంత్ రీసెంట్ హిట్ సినిమా జైలర్ 600 కోట్ల కలక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకి రజినీకాంత్ 210 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇదే అత్యధిక పారితోషికం. ఇప్పుడు దళపతి విజయ్, రజినీకాంత్‌ని మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్ . గత ఏడాది విజయ్ నటించిన ‘లియో’ సినిమా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. విజయ్ కి మార్కెట్ పెరిగింది. దీంతో విజయ్ కూడా తన పారితోషకాన్ని భారీగా పెంచేసినట్లు సమాచారం. తన 69వ సినిమాకి ఏకంగా 250 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో రజనీ కాంత్ ని బీట్ చేయటమే కాకుండా, సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకునే లిస్ట్ లో నిలిచాడు.
దళపతి విజయ్ రీసెంట్ గా రాజకీయ పార్టీ అనౌన్స్ చేశారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగాలని డిసైడ్ అయ్యారు. బహుశా విజయ్ చేయబోయే ఆఖరి సినిమా ఇదే కావచ్చని టాక్. విజయ్ 69 కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా, స్టూడియో గ్రీన్ అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ప్రజంట్ విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంలో నటిస్తున్నారు.