ENGLISH

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకీ రిబేటు లేదు!

03 February 2021-10:26 AM

స్టార్ హీరో సినిమా అంటే... హీరోయిన్లు ఎగ‌రి గంతేస్తారు. ఎందుకంటే.. స్టార్స్ సినిమాతోనే వాళ్ల‌కు ఎక్కువ మైలేజీ వ‌స్తోంది. మాస్ కి బాగా ద‌గ్గ‌ర‌వుతారు. పాపులారిటీ పెరుగుతుంది. అందుకే స్టార్స్ తో సినిమా అంటే పారితోషికం గురించి కూడా పెద్ద‌గా ఆలోచించ‌రు. సినిమాలో భాగ‌మైతే చాలు అనుకుంటారు. కానీ... సాయి ప‌ల్ల‌వి రూటే సెప‌రేటు. స్టార్స్ సినిమా అనేస‌రికి ఇంకొంచెం ఎక్కువ వ‌సూలు చేస్తోంద‌ట‌. ఆఖ‌రికి ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకీ త‌ను రిబేట్లు ఇవ్వ‌డం లేదు. వివరాల్లోకి వెళ్తే... ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానాల మ‌ల్టీస్టార‌ర్ ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే.

 

సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న సాయి పల్ల‌విని ఎంచుకున్నారు. ఈ సినిమా కోసం సాయి ప‌ల్ల‌వి ఏకంగా 1.5 కోట్లు డిమాండ్ చేస్తోంద‌ట‌. నిజానికి సాయి ప‌ల్ల‌వి పారితోషికం కోటి రూపాయ‌ల లోపే. `ల‌వ్ స్టోరీ`కి సైతం తాను కోటి రూపాయ‌లే తీసుకుంద‌ని టాక్‌. ఈ సినిమాకి మాత్రం మ‌రో అర‌కోటి పెంచేసింద‌ట‌. అయితే సాయి పల్ల‌వి అయితేనే క‌థానాయిక పాత్ర‌కు అందం, హుందాత‌నం వ‌స్తుంద‌ని గ్ర‌హించిన నిర్మాత‌లు సాయి ప‌ల్ల‌వి అడిగినంత ఇవ్వ‌డానికి రెడీ అయ్యారు. హీరోయిన్ల న‌యా స్ట్రాట‌జీ అలా వుంది మ‌రి.

ALSO READ: ఆదిపురుష్ సెట్లో అగ్ని ప్ర‌మాదం