ENGLISH

రామాయణ్ కోసం సాయి పల్లవి ఎంత తీసుకుందో తెలుసా?

07 March 2025-20:27 PM

ఈ మధ్య ఎక్కడ చూసినా సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. సాయి పల్లవి రీసెంట్ గా తండేల్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో దర్శకులు ఆమెతో కలిసి వర్క్ చేయటానికి క్యూ కడుతున్నారు. ఒకసారి సాయి పల్లవి తో వర్క్ చేసినవారు ఎవరైనా ఆమె వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే. మళ్ళీ మళ్ళీ తనతో వర్క్ చేయాలనీ అనుకుంటారు. ఈ క్రమంలో తెలుగు, తమిళం, హిందీలలో వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో రామాయణ్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో సాయి పల్లవి సీతగా, రణబీర్ రాముడిగా నటిస్తున్నాడు. సాయి పల్లవి క్రేజ్ చూసిన కరణ్ జోహార్ నెక్స్ట్ తన ప్రొడక్షన్ లో నటింపచేయాలని చూస్తున్నాడట.

ప్రస్తుతం సాయి పల్లవికి సంభంధించిన క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హిందీ రామాయణ్ కోసం సాయి పల్లవి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోంది అని టాక్ ఇప్పటివరకు 4 నుంచి 5 కోట్లు తీసుకునే సాయి పల్లవి ఇప్పుడు రామాయణ్ కోసం ఏకంగా 30 కోట్లు తీసుకుంటోంది అని టాక్. రామాయణ్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఒక్కో పార్ట్ కి 15 కోట్లు చొప్పున 2 పార్ట్స్ కి 30 కోట్లు తీసుకుంటోదట. సాయి పల్లవి సక్సెస్ రేటు చూసిన నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

ఇప్పటివరకు హైయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ పేరుండగా ఇప్పుడు ఈ ప్లేస్ లోకి సాయి పల్లవి చేరింది. నయన్ మొదటి బాలీవుడ్ డెబ్యూ జవాన్ కోసం 12 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకోగా. సాయి పల్లవి రామాయణ్ కోసం 30 కోట్లు అందుకుంటోంది. ఒక సౌత్ హీరోయిన్ బాలీవుడ్ లో ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోవటం గొప్ప విషయంఅని చెప్పాలి. ఇప్పటివరకు బాలీవుడ్ హీరోయిన్స్ కి కూడా ఇంత రెమ్యునరేషన్ లేదు.

ALSO READ: కింగ్ స్టన్ మూవీ రివ్యూ & రేటింగ్‌