ENGLISH

జెండర్ ఈక్వాలిటీ పై సమంత కామెంట్స్

17 October 2024-13:17 PM

స్టార్ హీరోయిన్ సమంత ఏం మాట్లాడినా, ఏం చేసినా క్షణాల్లో వైరలవుతుంది. సామ్ హానీ బనీ వెబ్ సిరీస్ తో అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు టీమ్. ముంబైలో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సామ్ కి ఇండస్ట్రీలో మహిళా ప్రాతినిధ్యం గురించి, లింగ సమానత్వం గురించి ప్రశ్నలు ఎదురవగా, సామ్ ఇచ్చిన ఆన్సర్స్, పలువుర్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సామ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇండస్ట్రీలో హీరోయిన్స్, వివిధ విభాగాల్లో పని చేసిన మహిళలు   ఫ్యూచర్ బాగుంది. పురుషులతో సమానంగా మహిళలని ట్రీట్ చేస్తున్నారని, జెండర్ బేధాలు లేవని తెలిపింది. 


ఇండస్ట్రీ లో జెండర్ ఈక్వాలిటీ ఉందని, సమాన అవకాశాలు కల్పించే ప్లేయింగ్ గ్రౌండ్ గా ఇండస్ట్రీని అభివర్ణించింది. ఇక్కడ కేవలం మన తెలివి, ప్రతిభ, బలాలు మాత్రమే జెండర్ ఈక్వాలిటీని కల్పించి, ఫేట్ ని నిర్ణయిస్తాయని సామ్ తన అభిప్రాయం చెప్పింది. ఈ ప్లాట్‌ఫామ్  చాలా అవకాశాలు కల్పిస్తుంది. స్త్రీల భవిష్యత్తు ఇక్కడ ఉజ్వలంగా ఉంది. ఇలాంటి చోట నేను భాగమైనందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న వ్యక్తులతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నానని సామ్ వ్యాఖ్యానించింది. 


జెండర్ వివక్ష లేకుండా అందరికీ ఛాన్స్ లు వస్తున్నాయని ఇప్పటికే ఆ మార్పు చూసానని, భవిష్యత్తులో ఇంకా బాగుంటుందని సామ్ ఆనందం వ్యక్తం చేసింది. సీటా డెల్ లో కూడా ఫీమేల్ రోల్ కి చాలా ప్రాధాన్యత ఉందని, హీరోతో సమానంగా తన క్యారక్టర్ ఉంటుందని హింట్ ఇచ్చింది సామ్. అంతా బాగానే ఉంది. జెండర్ ఈక్వాలిటీ ఉన్నప్పుడు పేమెంట్ లో ఎందుకంత తేడా ఉంటోంది. హీరోకి వందల కోట్లు ఉంటే హీరోయిన్స్ కి పదుల కోట్లలో ఉంది రెమ్యునరేషన్ అని పలువురు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.