ENGLISH

నాగచైతన్యకు లేని ఇబ్బంది మీకెందుకు?

30 May 2019-18:30 PM

సోషల్‌ మీడియాలో సూపర్‌ యాక్టివ్‌గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించి, పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన వివరాలను పోస్ట్‌ చేయడంతో పాటు, అప్పుడప్పుడూ హాట్‌ హాట్‌ పిక్స్‌ కూడా షేర్‌ చేస్తుంటుంది. తన లైఫ్‌ పాట్నర్‌తో ఎంజాయ్‌ చేసిన స్వీట్‌ అండ్‌ హాట్‌ మూమెంట్స్‌నీ సమంత ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటుంటుంది. అయితే, తాజాగా సమంత పోస్ట్‌ చేసిన పిక్‌ ఒకటి ట్రోలింగ్‌కి గురవుతోంది. ఈ పిక్‌లో సమంత తన ముఖం కనబడకుండా కట్‌ చేసింది. కానీ, టాప్‌ని ఎక్స్‌పోజ్‌ చేసింది. పూల చొక్కా ధరించింది. కానీ బటన్స్‌ ఓపెన్‌ చేసి, ఛెస్ట్‌ పార్ట్‌ని పూర్తిగా వదిలేసింది.

 

అయితే, అక్కడ పెద్దగా వల్గారిటీ ఏమీ కనిపించడం లేదు. కానీ, ఈ పిక్‌కి నెటిజన్స్‌ కామెంట్లు మాత్రం వరస్ట్‌గా ఉన్నాయి. ఒక నెటిజన్‌ సమంతను సపోర్ట్‌ చేస్తూ, నాగచైతన్యకు లేని ఇబ్బంది మీకెందుకు.. అంటూ ట్వీట్‌ చేసింది. ఇలాంటి ఫోటోలు పోస్ట్‌ చేయడమనేది హీరోయిన్స్‌ని సర్వ సాధారణమే. అయినా ఇలాంటి ఫోటోల్ని 90 శాతం మంది అబ్బాయిల్ని ఎట్రాక్ట్‌ చేసేందుకు పోస్ట్‌ చేస్తే, వాటిని చూసి 95 శాతం మంది ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తారు.

 

అలా ఎంజాయ్‌ చేసిన వారే, ఇలాంటి వరస్ట్‌ కామెంట్స్‌ కూడా పెడుతుంటారు.. అయినా పెళ్లయితే ఎక్స్‌పోజింగ్‌ చేయకూడదని రూలేమైనా ఉందా.? అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది ఆ నెటిజన్‌. ఈ ట్రోలింగ్స్‌ పట్ల అక్కినేని కోడలు సమంత ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం సమంత 'మన్మధుడు 2'లో గెస్ట్‌ రోల్‌ పోషిస్తోంది. మరోవైపు హీరోయిన్‌గా శర్వానంద్‌తో '96' రీమేక్‌లో నటిస్తోంది.

ALSO READ: మగ్గం వీరుడు మామూలోడు కాడు!