ENGLISH

స‌మంత‌కు 'అక్కినేని' భార‌మైందా?

27 August 2021-12:00 PM

నాగ‌చైత‌న్య‌ని పెళ్లి చేసుకోగానే.. `అక్కినేని స‌మంత‌` అంటూ త‌న పేరు ముందు ఇంటి పేరు త‌గిలించింది స‌మంత‌. అది న్యాయం కూడా. ఎప్పుడైతే చైతూ వేలు ప‌ట్టుకుని ఏడ‌డుగులు వేసిందో, అప్పుడే అక్కినేని ఇంటిలో భాగం అయిపోయింది స‌మంత‌. `అక్కినేని స‌మంత‌` అని పిల‌వ‌డం త‌న‌కు గ‌ర్వంగా ఉంద‌ని, ఆ పేరు గౌర‌వం తీసుకొచ్చింద‌ని అప్ప‌ట్లో చెప్పింది స‌మంత‌. అయితే స‌డ‌న్ గా స‌మంత పేరు ముందు అక్కినేని వెళ్లిపోయింది. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో కేవ‌లం `ఎస్‌` క‌నిపిస్తోందంతే.

 

ఈ హ‌ఠాత్ప‌రిణామం చాలా ఊహాగానాల‌కు తెర‌లేపుతోంది. చై - స‌మంత మ‌ధ్య ఏమైనా గ్యాప్ వ‌చ్చిందా? వాళ్లు విడిపోతున్నారా? అందుకే స‌మంత `అక్కినేని` పేరుని వ‌దులుకుందా? అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల స‌మంత‌కి ఈ ప్ర‌శ్న కూడా ఎదురైంది. అయితే దానికి స‌మంత స్ప‌ష్టంగా స‌మాధానం చెప్పలేదు. దాంతో.. ఈ గాసిప్పుల‌కు మ‌రింత ఊతం వ‌చ్చిన‌ట్టైంది. నిజానికి.. ఇటీవ‌ల స‌మంత - చై క‌లిసి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో `నేను కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉండాల‌నుకుంటున్నా` అని క్లారిటీగా చెప్పేసింది. ఇవ‌న్నీ చూస్తుంటే.. ఏదో జ‌రుగుతోంద‌న్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. మ‌రి... ఏం జరుగుతోందో లోలోప‌ల‌.

ALSO READ: Samantha Latest Photoshoot