ENGLISH

ఒక్క గంట‌కు నాలుగు ల‌క్ష‌లా?

06 November 2020-16:13 PM

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకునే టైపు మ‌న క‌థానాయిక‌ల‌ది. అటు సినిమాలు, ఇటు వ్యాపార ప్ర‌క‌ట‌న‌లు, వెబ్ సిరీస్ లూ, టాక్ షోలూ.. ఇలా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ కాలు పెడుతూ.. ల‌క్ష‌లు, కోట్లు సంపాదిస్తున్నారు. ఈ త‌ర‌హా క‌థానాయిక‌ల్లో స‌మంత ముందు వ‌రుస‌లోనే ఉంటోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే, `ఫ్యామిలీ మెన్‌` వెబ్ సిరీస్‌లో న‌టించింది స‌మంత‌. ఇప్పుడు.. `ఆహా` కోసం ఓ టాక్ షో చేస్తోంది.

 

ఈ షోకోసం స‌మంత అందుకుంటున్న పారితోషికం చిత్ర‌సీమ‌ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ గంట సాగుతుంది. అందుకోసం. స‌మంత‌.. ఏకంగా 4 ల‌క్ష‌ల పారితోషికాన్ని అందుకోబోతున్న‌ట్టు టాక్‌. ఒక రోజు.. రెండు ఎపిసోడ్ల‌ని పూర్తి చేయ‌బోతున్నార్ట‌. అలా.. క‌నీసం 30 ఎపిసోడ్ల‌ని `ఆహా` కోసం రూపొందించ‌బోతున్నార‌ని స‌మాచారం. అంటే.. ఈ ఎపిసోడ్ల ద్వారా 1 కోట్ల 20 ల‌క్ష‌ల వ‌ర‌కూ స‌మంత సంపాదించ‌బోతోంది. అంటే దాదాపు ఓ సినిమా పారితోషికం అనుకోవాలి. సినిమా అంటే.. డాన్సులు, లొకేష‌న్ల వెంట తిర‌గ‌డం.. ఇలాంటివ‌న్నీ ఉంటాయి. ఇది అలా కాదు. హాయిగా ఓ చోట కూర్చుని.. నాలుగు మాట‌లు మాట్లాడ‌డ‌మే. ఇదేదో మంచి బేర‌మే క‌దా..?

ALSO READ: Samantha Latest Photoshoot