ENGLISH

మల్లు వుడ్ కి సామ్

13 June 2024-15:05 PM

సమంత ఏం చేసినా సెన్షేషనే. సినిమా అయినా, సొషల్ మీడియా ఎక్కడైనా తనదే హవా. ఏడాదిగా ఒక్క సినిమా చేయకపోయినా, ఎప్పుడు ట్రెండింగ్  లోనే ఉంటోంది. మయాసైటీస్  కారణంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చి, విహార యాత్రలు, ఆధ్యాత్మిక బాట పట్టింది. పూర్తిగా  కోలుకొని రెట్టించిన ఉత్సహంతో ఇప్పుడు రీ ఎంట్రీ కి రెడీ అవుతోంది. సమంత ఇండస్ట్రీ కి వచ్చి ఇన్నిఏళ్ళు  అయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. బడా హీరోల సినిమాల్లో, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ లు అందుకుంటోందని సమాచారం. హిందీలో సామ్ నటించిన సీటా డెల్ వెబ్ సిరీస్ తొందరలోనే రిలీజ్  కానుంది. బాలీవుడ్ లో మరికొన్ని కథలు వింటున్నట్టు టాక్.       


తెలుగు , తమిళం, హిందీ  భాషల్లో సత్తా చాటిన సమంత  ఇప్పుడు మల్లువుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో మల్లు సినిమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో కోట్ల లాభాలు గడిస్తున్నాయి. దీనితో పలువురు  తారలు మల్లువుడ్ లో నటించటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అనుష్క మలయాళం లో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సామ్ కూడా మల్లువుడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


ఇప్పటివరకు సామ్ అన్ని భాషల్లోనూ యంగ్ హీరోలతో నటించింది. సీనియర్స్ తో జోడికట్టలేదు. కానీ మొదటి సారిగా మలయాళంలో సీనియర్ హీరోతో నటిస్తోంది. అతను మరెవరో కాదు కుర్ర హీరోలతో పోటీ పడి ఈ ఏజ్ లో కూడా  ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ, వరుస విజయాలు సాధిస్తున్న మమ్ముట్టి. గౌతమ్ మీనన్ దర్శకత్వం లో తెరకెక్కతున్న ఈ మూవీ లో మమ్ముట్టి కి జోడిగా సామ్ నటిస్తోంది. పోలీస్ ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోందని సమాచారం.