ENGLISH

Samantha: అనుష్క న‌ష్టాన్ని స‌మంత తీరుస్తుందా?

11 January 2023-16:13 PM

రాజమౌళి త‌ర‌వాత అంత భారీ విజ‌న్ ఉన్న ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌. అస‌లు తెలుగు సినిమాల్లో అత్యంత భారీ సెట్లు చూసింది గుణ‌శేఖ‌ర్ సినిమాల్లోనే. విజువ‌ల్ ఫీస్ట్ ఎలా ఉంటుందో చూపించిన ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. అయితే కొన్నేళ్లుగా ఆయ‌న ట్రాక్ త‌ప్పింది. రుద్ర‌మ‌దేవి కోసం ఆయ‌న ఎంత క‌ష్ట‌ప‌డినా ఫ‌లితం రాలేదు. ఆ సినిమాతో కోట్టు న‌ష్ట‌పోయాయి. ఇప్పుడు మ‌ళ్లీ `శాకుంత‌లం` చిత్రాన్ని అత్యంత వ్య‌య ప్ర‌యాస‌ల‌తో నిర్మిస్తున్నారు గుణ‌శేఖ‌ర్‌. ఈ సినిమాపై కూడా భారీగా ఖ‌ర్చు పెట్టారు. ఇండియ‌న్ స్క్రీన్ పై అత్యంత ఖ‌రీదైన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇదే అని గుణ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించారు. ఈసినిమాపై క‌నీసం రూ.,75 కోట్ల‌యినా ఖ‌ర్చ‌యి ఉంటుంద‌ని టాక్‌. పాన్ ఇండియా సినిమా, స‌మంత సినిమా కాబ‌ట్టి.. గిట్టుబాటు అయ్యే ఛాన్సుంది. కాక‌పోతే.. సినిమాకి సూప‌ర్ డూప‌ర్ హిట్ అనే టాక్ రావాలి. అప్పుడు గానీ.. ఈ సినిమా పెట్టుబడి తిరిగి రాబ‌ట్టుకోలేదు.

 

నిన్ననే ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ చూడ్డానికి బాగుంది. భారీగా ఖ‌ర్చు పెట్టార‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. త్రీడీలో పెద్ద తెర‌పై చూస్తే ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. సంక్రాంతి సినిమాల విడుద‌ల, హ‌డావుడీ అయిపోయాక‌.. ప్ర‌మోష‌న్స్ మొద‌లెడ‌తారు. పాట‌లూ, ఇంకొన్ని టీజ‌ర్లూ బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.... ఈ సినిమా లోతెంతో అర్థ‌మ‌వుతుంది. సినిమా హిట్ట‌యితే.. రుద్ర‌మ‌దేవి న‌ష్టాలు కూడా స‌మంత‌తో భ‌ర్తీ చేయొచ్చు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.