ENGLISH

Tegimpu Review: 'తెగింపు' మూవీ రివ్యూ &రేటింగ్!

11 January 2023-15:33 PM

నటీనటులు: అజిత్, మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని, అజిత్ తదితరులు
దర్శకుడు : హెచ్ . వినోద్
నిర్మాత: బోనీ కపూర్
సంగీత దర్శకులు: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
ఎడిటర్: విజయ్ వెలికుట్టి


రేటింగ్ : 2.5/5


సంక్రాంతి బరిలో ముందుగా దిగింది అజిత్ తెగింపు. నిజానికి ఈ సినిమాలో తెలుగులో పెద్ద ప్రమోషన్స్ చేయలేదు. పెద్ద బజ్ కూడా క్రియేట్ కాలేదు. అజిత్ గత కొన్ని చిత్రాల్లో తెలుగులో పర్వాలేదనిపించాయి. అదే నమ్మకంతో తెలుగు వెర్షన్ ని నేరుగా థియేటర్ లోకి వదిలారు. ట్రైలర్ చూస్తే ఇదొక బ్యాంకు రాబరీ సినిమాని అర్ధమైయింది. అజిత్ కి వలిమై లాంటి యాక్షన్ హిట్ ఇచ్చిన వినోద్ దర్శకుడు కావడం, ట్రైలర్ లో భారీ యాక్షన్ సీన్లు కనిపించడం ఆసక్తిని పెంచింది. మరి ట్రైలర్ లో కనిపించిన ఆసక్తి సినిమాలో ఉందా ? సంక్రాంతి ఓపెనర్ గా వచ్చిన అజిత్ తెగింపు చూపించాడా ? ఇంతకీ తెగింపు కథ ఏంటి ? 


కథ :


పోలీస్ అధికారి అజయ్ ఓ ముఠా తో కలసి విశాఖ‌లోని యువ‌ర్ బ్యాంక్‌లో రూ.500 కోట్ల దోపిడీకి ప్లాన్ వేస్తాడు. పక్కా స్కెచ్ తో బ్యాంక్‌లోకి చొర‌బ‌డిన గ్యాంగ్ వ్యూహాన్ని చిత్తు చేస్తూ అక్కడ డార్క్ డెవిల్ (అజిత్‌) ప్రత్యక్షం అవుతాడు. డార్క్ డెవిల్ వచ్చింది కూడా బ్యాంకు దోపిడీకే . మ‌రి డార్క్ డెవిల్ బ్యాంక్ దోపిడీ  చేశాడా ? ఈ దోపిడీని పోలీసులు అడ్డుకున్నారా ? ఇంత‌కీ ఈ డార్క్ డెవిల్ ఎవ‌రు? అజయ్ చేసిన రాబరీ ప్లాన్ లోకి డార్క్ డెవిల్ ఎలా వచ్చాడు ? అత‌డి ల‌క్ష్యం ఏమిట‌నేది మిగతా కథ.  


విశ్లేషణ:


పోలీసు ప్లాన్ చేసిన గ్యాంగ్ దోపిడీ కోసం బ్యాంక్‌లోకి అడుగు పెట్టిన‌ప్పట్నుంచి క‌థ మొదలౌతుంది. ఐతే బ్యాంక్ లో జరిగిన దోపిడీ వ్యవహారం ఇది వరకూ చాలా సినిమాల్లో చూసినట్లే అనిపిస్తుంది. అలాగే రాబరీ వ్యవహారం చాలా తికమకగా వుంటుంది. రాబరీ రక్తి కట్టాలంటే ఎత్తుకుపై ఎత్తులు వుండాలి. కానీ తెగింపు కథలో అది లోపించింది. హీరో బలవంతుడని మాత్రమే చూపిస్తూ .. డార్క్ డెవిల్ ఎవ‌ర‌నే అంశాల్ని అలాగే దాచిపెడుతూ ద్వితీయార్ధం వరకూ కాలక్షేపం చేశారు. ఫస్ట్ హాఫ్ లో అజిత్ మార్క్ యాక్షన్‌, ఫ్యాన్స్‌ని అల‌రించే అంశాల్ని పుష్కలు వున్నాయి.


ద్వితీయార్ధంలో డార్క్ డెవిల్ నేపధ్యం చూపించడం ఆసక్తికరంగానే వుంటుంది. అయితే రాబరీ కథలోకి ఆ పాత్రని తీసుకొచ్చిన తీరు మాత్రం అంత సహజంగా అనిపించదు. పైగా  ప్రజల బ‌ల‌హీన‌త‌ల్ని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవ‌స్థ గురించి వివరిస్తూ సందేశం ఇస్తున్నట్లు పాఠం చెబుతున్నట్లు నడిచే  ద్వితీయార్ధం ఈ రాబరీ డ్రామాకి నప్పలేదు. బ్యాంకింగ్ వ్యవ‌స్థలో మోసాల‌కి సంబంధించిన అంశాలు ఇందులో చూపించారు. అవి బావున్నప్పటికీ.. ఈ కథకు ఆ ట్రీట్ మెంట్ వర్క్ అవుట్ కాలేదు. ఒక డార్క్ డెవిల్ సోషల్ ఇష్యూ గురించి పోరాడి ప్రజలకు న్యాయం చేయడం కొత్త ఉంటుందని అనుకున్నారు కానీ.. దాన్ని తరపై చూపించడంలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యింది  


నటీనటులు :


తెగింపుకి అంతా తానై నడిపాడు అజిత్. ఆయన గ్రేస్ అభిమానులని అలరిస్తుంది. డార్క్ డెవిల్ పాత్రని చాలా యీజ్ తో చేశాడు.  ర‌మ‌ణి పాత్రలో మంజు వారియ‌ర్ కనిపించింది.


యాక్షన్ స‌న్నివేశాల్లో ఆమె న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. స‌ముద్రఖ‌ని, జాన్ కొక్కేన్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. అజయ్ కీలకమైన పాత్రలోనే కనిపించాడు. మిగతా నటులు పరిధి మేర చేశారు 


టెక్నికల్:


జిబ్రాన్ సంగీతం బావుంది కానీ కొన్ని చోట్ల ఓవర్ అయ్యిందనే ఫీలింగ్ కలిగింది. నిరవ్ షా కెమరా పనితనం ఆకట్టుకుంది. విజువల్స్ రిచ్ గా వున్నాయి.


ముఖ్యంగా సముద్రం జరిగిన యాక్షన్ సీక్వెన్స్ ని చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు. 
నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.  


ప్లస్ పాయింట్స్


అజిత్ 
యాక్షన్ సన్నివేశాలు 
నిర్మాణ విలువలు 


మైనస్ పాయింట్స్


కథలో బలం లేకపోవడం 
ఎమోషన్ కనెక్ట్ కాకపోవడం 
బలహీనమైన కథనం 

ఫైనల్ వర్డిక్ట్:  సంక్రాంతి ముందే 'ముగింపు'