ENGLISH

Shakuntalam: ట్రైలర్ టాక్ : కాళిదాసు రచనకి దృశ్యరూపం శాకుంతలం

09 January 2023-12:18 PM

కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం టైటిల్‌ పాత్రను సమంత పోషించగా.. దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటించారు. ఈ పాన్‌ ఇండియాగా సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానున్న నేపథ్యంలో ఈ రోజు ట్రైలర్‌ను విడుదల చేశారు. ''ఈ భూమి మీద అమ్మానాన్నకు అక్కర్లేని తొలి బిడ్డ మేనక విశ్వామిత్రుల ప్రేమకి గుర్తుగా ఈ పాప పుట్టింది. శాకుంతుల కారణ జన్మురాలు. ఒక నవనాగరిక చరిత్రకు నాంది పలకబోతుంది'' అనే వాయిస్ మొదలైన ట్రైలర్.. విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.

 

శకుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు ప్రేమ కథ ఇది. ప్రేమకథని హృద్యంగా చుపించారు. దాదాపు నాటకంలో చాలా సన్నివేశాలు ట్రైలర్ లో కనిపించాయి. ట్రైలర్ లో సమంత అందం అభినయం ఆకట్టుకుంది. భారీ విజువల్స్ కనిపించాయి. త్రీడీలో ఈ విజువల్స్ మరింత రిచ్ గా వుండే అవకాశం వుంది. ట్రైలర్ చివర్లో వచ్చిన యుద్ధాలు కూడా ఆకట్టుకున్నాయి.

 

ట్రైలర్ చూస్తుంటే.. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంకు దృశ్యరూపం ఇవ్వడానికి గుణశేఖర్‌ తన శక్తిమేరకు ప్రయత్నించారని అర్ధమౌతుంది. థియేటర్ ఎక్స్ పీరియాస్ ఇచ్చే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతుంది.