ENGLISH

Varasudu: వారసుడు 14కి వాయిదా?

09 January 2023-11:00 AM

ఈ ఏడాది సంక్రాంతికి సిద్ధమైన సినిమాల్లో విజయ్‌ హీరోగా నటించిన ‘వారిసు’ ఒకటి. ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదోఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొదట ఈ సినిమాను జనవరి 12న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

 

అయితే, ఈ సినిమా విడుదల విషయంలో చిత్ర నిర్మాత దిల్‌రాజు సడెన్‌గా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. విడుదల తేదీని ఒకరోజు ముందుకు జరిపారు. జనవరి 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా మారిపోయింది. తెలుగు వెర్షన్ వారసుడు 14న విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని ఈ రోజు ప్రెస్ మీట్ లో అధికారికంగా ప్రకటిస్తారు దిల్ రాజు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ సరసన రష్మిక నటిస్తోంది.

ALSO READ: ఎన్టీఆర్ డీఎన్ఏ.. కమల్ హసన్ డీఎన్ఏ కలిస్తే..