ENGLISH

Vashist: 'బింబిసార' ద‌ర్శ‌కుడికి బంప‌ర్ ఆఫ‌ర్‌

09 January 2023-10:00 AM

2022 హిట్ చిత్రాల్లో బింబిసార ఒక‌టి. క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని అందుకొంది. ఈ సినిమాతో వ‌శిష్ట్ అనే ద‌ర్శ‌కుడు తెర‌పైకి వ‌చ్చాడు. బింబిసార త‌ర‌వాత బింబిసార 2 వ‌ర్క్ మొద‌ల‌వ్వాలి. అయితే.. ఇప్పుడు బాల‌య్య కోసం ఓ క‌థ రెడీ చేశాడ‌ని టాక్‌. ఇటీవ‌ల బాల‌య్య‌తో వ‌శిష్ట్ క‌థా చ‌ర్చ‌లు జ‌రిపాడ‌ని, బాల‌య్య‌కు ఈ లైన్ బాగా న‌చ్చింద‌ని, స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేయ‌మ‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం అందుతోంది.

 

గీతా ఆర్ట్స్‌లో బాల‌య్య ఓసినిమా చేయాలి. వ‌శిష్ట్ కూడా గీతా ఆర్ట్స్ ద‌గ్గ‌ర అడ్వాన్సు తీసుకొన్నాడు. సో.. గీతా ఆర్ట్స్ లో ఈ కాంబో సెట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఈలోగా అనిల్ రావిపూడితో ఓ సినిమా పూర్తి చేయాలి బాల‌కృష్ణ‌. ఆ వెంట‌నే.. బోయ‌పాటి శ్రీ‌ను ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ త‌ర‌వాతే... విశిష్ట్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఈలోగా వశిష్ట్ కూడా `బింబిసార 2` పూర్తి చేయొచ్చు. మొత్తానికి... వ‌రుస‌గా నంద‌మూరి హీరోల‌తో ప‌నిచేస్తూ బంప‌ర్ ఆఫ‌ర్లు కొట్టేస్తున్నాడు వ‌శిష్ట్.

ALSO READ: ఎన్టీఆర్ డీఎన్ఏ.. కమల్ హసన్ డీఎన్ఏ కలిస్తే..