ENGLISH

ప్ర‌భాస్ సినిమాలో స్టార్లే.. స్టార్లు

04 August 2021-12:21 PM

ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌. త‌న సినిమా అంటే మినిమం రెండొంద‌ల నుంచి మూడొంద‌ల కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. త‌న సినిమాలో స్టార్ల‌కు కూడా కొద‌వ ఉండ‌దు. `ప్రాజెక్ట్ కె`లో కూడా బోలెడంత మంది స్టార్లు క‌నువిందు చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ - నాగ అశ్విన్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సోషియో, ఫాంట‌సీ, సైన్స్ ఫిక్ష‌న్ సినిమా.. ఇది. ప్ర‌స్తుతానికి ప్రాజెక్ట్ కె అని నామ‌క‌ర‌ణం చేశారు. త్వ‌ర‌లోనే టైటిల్ ని రివీల్ చేస్తారు. ఈ సినిమాలో దీపికా ప‌దుకొణె క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీపిక న‌టిస్తున్న తొలి తెలుగు సినిమా ఇది.

 

అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మ‌రో క‌థానాయిక కూడా న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ పాత్ర కోసం స‌మంత పేరు ప‌రిశీలిస్తున్నార్ట‌. అంతేకాదు.. మ‌రో ఇద్ద‌రు హీరోలు సైతం ఈ సినిమాలో క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. అయితే ఇద్ద‌రు హీరోల‌వీ.. అతిథి పాత్ర‌లే. రెండు మూడు స‌న్నివేశాల కోసం ఇద్ద‌రు స్టార్ హీరోల్ని ఎంపిక చేయాల్సివుంది. ప్ర‌భాస్‌ సినిమా, పైగా అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి స్టార్ ఉన్నారు, పాన్ ఇండియా ప్రాజెక్ట్.. కాబ‌ట్టి.. ఎవ‌ర్ని అడిగినా కాద‌న‌రు. మ‌రి.. ఆ ఇద్ద‌రూ ఎవ‌రో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: నాగ్ సినిమాలో 'బిగ్ బాస్‌' లేడీ!