అర్జున్ రెడ్డితో దుమ్ము లేపాడు.. సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమాని బాలీవుడ్ కి తీసుకెళ్లి అక్కడా సూపర్ హిట్ కొట్టాడు. సందీప్‌రెడ్డి తదుపరి సినిమా విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగాయి. మహేష్ బాబుతో సినిమా ఓకే అయ్యిందనుకున్నారంతా. ఇద్దరి మధ్యా కథా చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ తరవాత ఆ ప్రాజెక్టు ఎందుకో వర్కవుట్ కాలేదు. అయితే మహేష్ పై.. ఆశలు వదులుకోలేదు ఈ దర్శకుడు. మహేష్ తో తప్పకుండా సినిమా చేస్తా అంటున్నాడు.
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం అంతా ట్విట్టర్ వేడెక్కిపోయింది. మహేష్ పై సెలబ్రెటీలు, అభిమానులూ.. తమ ప్రేమని చాటుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి కూడా తన మనసులోని మాట బయటపెట్టారు. ఇప్పటి వరకూ.. మహేష్ లోని ప్రతిభని 25 శాతం మాత్రమే చూపించారని, ఇంకా 75 శాతం తనలోనే ఉందని, మహేష్ తో పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కామెంట్ చేశాడు సందీప్ రెడ్డి. ప్రస్తుతం సందీప్ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరవాత.. మహేష్ తో జట్టు కట్టే అవకాశం ఉంది. అయితే ఈలోగా మహేష్ త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్ని పూర్తి చేయాల్సివుంది. అప్పటి వరకూ ఈ అర్జున్ రెడ్డి దర్శకుడు వెయిటింగ్ లో ఉండాల్సిందే.
ALSO READ: రెండు కోట్లు అడుగుతున్న కుర్ర హీరో!