ENGLISH

'బాండ్‌' సప్తగిరి ఈ రోజు ఏం చేస్తాడో!

07 December 2017-12:07 PM

కమెడియన్‌గా అందరికీ ప్రీతి పాత్రుడయ్యాడు సప్తగిరి. తనదైన శైలిలో కామెడీతో అలరించిన సప్తగిరి బాలీవుడ్‌కి 'జేమ్స్‌బాండ్‌'లాగా, టాలీవుడ్‌కి కామెడీ బాండ్‌ అయిపోయాడు. హీరోగా మారి ఆడియన్స్‌ అటెన్షన్‌ని తన వైపు తిప్పుకున్నాడు. 

హీరోగా తొలి సినిమాకి తన పేరుతో 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' అనే టైటిల్‌ని పెట్టుకున్నాడు. తాజాగా వస్తోన్న సినిమాకి కూడా తన పేరుతోనే 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' అనే టైటిల్‌నే ఎంచుకున్నాడు. తన పేరునే ఓ బ్రాండ్‌గా మార్చేసుకున్నాడు సప్తగిరి. అందుకే హీరోగా మారాక కూడా సప్తగిరి సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించుకుంటున్నాడు. హీరోగా సప్తగిరికి రెండో సినిమా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. 

ఈ సినిమాకి ప్రమోషన్‌ పరంగా చాలా కష్టపడ్డాడు. తన కష్టాన్ని గుర్తించి, స్టార్‌ హీరోలు టెక్నీషియన్లు సపోర్ట్‌నిచ్చారు. ఈ సినిమా ట్రైలర్‌ని మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా విడుదల చేయించాడు. అలాగే తొలి ఆడియో సింగిల్‌ని స్టార్‌ డైరెక్టర్‌ అయిన వినాయక్‌చే విడుదల చేయించాడు. తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తో ఓ సాంగ్‌నీ, నేచురల్‌ స్టార్‌ నానితో మరో సాంగ్‌నీ విడుదల చేయించి, ఆడియన్స్‌ దృష్టిని భలే ఆకర్షించాడు. ఎక్కడా తగ్గని కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. అదే ఆయనలో మెచ్చుకోదగ్గది. 

తొలి సినిమాకి ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ని ఆడియో ఫంక్షన్‌కి చీఫ్‌ గెస్ట్‌గా ఆహ్వానించి, పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అందరి అభిమానాన్ని పొందాడు. మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అన్నందుకు హీరోగా తన సినిమాలకు మెగా ఫ్యామిలీ సపోర్ట్‌ బాగా లభించింది. 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా ఈ సినిమాకి కేటాయించిన ధియేటర్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. మెగా సపోర్ట్‌ పొందిన సినిమా కదా.. సందడి బాగానే ఉంది. చూడాలి మరి ఈ సారి సప్తగిరి ఏం చేస్తాడో!

ALSO READ: ఇదే మన ఎన్టీఆర్ టెంపర్ రీమేక్