ENGLISH

200 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయిన స‌ర్కారు వారి పాట‌

23 May 2022-14:00 PM

మ‌హేష్ బాబు - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా `స‌ర్కారు వారి పాట‌`. ఈ సినిమాకి విడుద‌ల రోజున డివైట్ టాక్ న‌డిచింది. అయితే వ‌సూళ్ల‌పై ఆ టాక్ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేద‌నే చెప్పాలి. మ‌హేష్ సినిమాకి `యావ‌రేజ్‌` టాక్ వ‌చ్చినా, వ‌సూళ్ల‌కు ఢోకా ఉండ‌దు. ఈ విష‌యం `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రోసారి రుజువు అయ్యింది. రూ.100 కోట్ల క్ల‌బ్‌లో తొలి మూడు రోజుల్లోనే చేరిపోయిన స‌ర్కారు వారి పాట‌.. మెల్ల‌గా రూ.150 కోట్ల క్ల‌బ్ లోకి ఎంట‌రై.. ఇప్పుడు 200 కోట్ల క్ల‌బ్ లోకి కూడా వచ్చేసింది.

 

తొలి 11 రోజుల్లో దాదాపుగా రూ.196 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ... 154 కోట్లు తెచ్చుకున్న ఈ చిత్రం క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియాలో రూ.15 కోట్లు సాధించింది. ఓవ‌ర్సీస్‌లో 27.4 కోట్లు వ‌సూలు చేసింది. ఈవారం ఎఫ్ 3 రాబోతోంది. అది మిన‌హా మ‌రో పెద్ద సినిమా ఏదీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర లేదు. కాబ‌ట్టి.. ఈ వారం కూడా ఎన్నో కొన్ని వ‌సూళ్లు ద‌క్కే అవ‌కాశం ఉంది.

ALSO READ: 'శేఖ‌ర్‌'.. ఎంత పోయిందో తెలుసా?