ENGLISH

'అ' సెంటిమెంట్ కొన‌సాగిస్తున్న త్రివిక్ర‌మ్‌

23 May 2022-13:25 PM

త్రివిక్ర‌మ్ కి సెంటిమెంట్లు ఎక్కువ‌. ముఖ్యంగా టైటిళ్ల విష‌యంలో. త‌న సినిమా టైటిళ్లు ఎక్కువ‌గా 'అ'తో మొద‌ల‌వుతాయి. 'అత‌డు', 'అత్తారింటికి దారేది', 'అ.ఆ', 'అజ్ఙాత‌వాసి', 'అర‌వింద స‌మేత‌' 'అల వైకుంఠ‌పుర‌ములో' ఇలా... టైటిళ్ల‌న్నీ 'అ'తో మొద‌ల‌య్యేవే. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు త్రివిక్ర‌మ్. ఈసారి కూడా అదే సెంటిమెంట్ కంటిన్యూ చేయాల‌ని చూస్తున్నారు త్రివిక్ర‌మ్‌.

 

మ‌హేష్ సినిమా కోసం 'అ'తో మొద‌ల‌య్యే టైటిల్ కోసం అన్వేషించారు. చివ‌రికి ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని స‌మాచారం. ఈనెల 28 కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. `అత‌డు`లో మ‌హేష్ పేరు.. పార్థు. మ‌హేష్ తాజా సినిమాకి అదే పేరు పెడ‌తార‌ని అనుకున్నారంతా. కానీ అర్జునుడు పేరు ఫిక్స్ చేయాల‌ని చూస్తున్నారు. ఇక్క‌డ ట్విస్టేమిటంటే.. అర్జునుడుకి మ‌రో పేరు పార్థు. అలా... అత‌డు సెంటిమెంట్ ని కూడా త్రివిక్ర‌మ్ కంటిన్యూ చేసిన‌ట్టు అవుతోంది.

ALSO READ: 'శేఖ‌ర్‌'.. ఎంత పోయిందో తెలుసా?