ENGLISH

స‌ర్కారు వారి పాట‌.. రిలీజ్ డేట్ రెడీనా?

12 December 2020-10:00 AM

కొబ్బ‌రికాయ కొట్ట‌క ముందే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డం మామూలు విష‌యం కాదు. సినిమాపై చాలా న‌మ్మ‌కం ఉండాలి. పైగా ప్లానింగ్ ప‌ర్‌ఫెక్ట్ గా కుద‌రాలి. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన చాలా సినిమాలు, ఆ త‌ర‌వాత‌.. చెప్పిన స‌మ‌యానికి సినిమాని రెడీ చేయ‌లేక‌, వాయిదా ప‌ర్వంలో ప‌డ్డాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల‌కు ఈ స‌మ‌స్య ఉంది. అయితే.. ఇవ‌న్నీ తెలిసి కూడా మ‌హేష్ బాబు ఈ రిస్క్ చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డాడు.

 

మ‌హేష్ బాబు - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. కీర్తి సురేష్ క‌థానాయిక‌. జ‌న‌వ‌రిలో షూటింగ్ మొద‌లు కానుంది. అయితే.. ఈసినిమాని ఆగ‌స్టు 7న రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నార్ట‌. ఆ రోజే విడుద‌ల చేయ‌డానికి ఓ కార‌ణం ఉంది. `శ్రీ‌మంతుడు` అగ‌స్టు 7నే విడుద‌లై సూప‌ర్ హిట్ అయ్యింది. ఈసినిమా కూడా మైత్రీ మూవీస్ నుంచి వ‌చ్చిందే. అందుకే.. ఆ డేట్ నే మ‌రోసారి సంచ‌న‌లం సృష్టించాల‌ని మైత్రీ మూవీస్ భావిస్తోంద‌ట‌. అయితే రిలీజ్‌డేట్ ముందే ఫిక్స్ చేస్తే.. త‌న‌పై ఒత్తిడి పెరుగుతుంద‌ని ప‌ర‌శురామ్ భ‌య‌ప‌డుతున్నాడు. కానీ ఎట్టిప‌రిస్థితుల్లోనూ అగ‌స్టు 7న ఈ సినిమా రెడీ అవ్వాల‌ని మ‌హేష్ అల్టిమేట్టం జారీ చేశాడ‌ట‌. మ‌రి ప‌ర‌శురామ్ అప్ప‌టికి సినిమాని రెడీ చేస్తాడో లేదో చూడాలి.

ALSO READ: వంశీతో మ‌హేష్‌... ఇది నిజ‌మేనా?