ENGLISH

హీరోగా మారుతున్న మరో కమెడియన్‌

19 July 2018-14:02 PM

ఇప్పటికే పలువురు కమెడియన్లు హీరోలుగా మారి సత్తా చాటుతున్నారు. కమెడియన్లు హీరోలుగా మారడమనేది ఈనాటి విషయం కాదు, కొత్త విషయం అంతకన్నా కాదు, అలనాటి ప్రముఖ కమెడియన్‌ రాజబాబు కాలం నుండి, బాబూ మోహన్‌, బ్రహ్మానందం, అలీ ఇలా చెప్పుకుంటూ పోతే నేటి సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్‌ తదితరులు హీరోలుగా తమ టాలెంట్‌ చూపించేశారు. 

తాజాగా ఇదే బాటలో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నాడు మరో ప్రముఖ కమెడియన్‌ సత్యం రాజేష్‌. తొలి సినిమా 'సత్యం' తన ఇంటి పేరుగా మార్చుకున్నాడీ యంగ్‌స్టర్‌. తనదైన టైమింగ్‌తో కామెడీ పండించి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ దక్కించుకున్నాడు. ఇటీవల అడవిశేష్‌, ఆదా శర్మ జంటగా తెరకెక్కిన 'క్షణం' సినిమాలో ఇంపార్టెంట్‌ పాత్ర పోషించాడు. కమెడియన్‌గా కాకుండా, డిగ్నిఫైడ్‌ అండ్‌ సీరియస్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించి మెప్పించాడీ సినిమాలో సత్యం రాజేష్‌. ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. 

'బ్రహ్మర్షి విశ్వామిత్ర' అనే సినిమాతో రాజేష్‌ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. అమెరికాలో జరిగిన ఓ యదార్ధ గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజ్‌కిరణ్‌ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. హీరో అంటే ఫైట్లూ, డాన్సులు ఒక్కటేంటీ అన్నీ చేయాలి.

 

మరింతవరకూ కామెడీతోనే ఆకట్టుకున్న సత్యం రాజేష్‌ హీరోగా తనలో ఉన్న హీరో టాలెంట్‌ని ఎలా బయటకి తీసుకొస్తాడో చూడాలిక.

 

ALSO READ: బిగ్ బాస్ సభ్యులకి, వీక్షకులకి షాక్ ఇచ్చిన ప్రదీప్