ENGLISH

పాపం ‘అఖిల్‌’ హీరోయిన్‌ని ట్రోల్‌ చేస్తున్నారుగా.!

10 November 2020-17:22 PM

తెలుగులో ఆమెకి తొలి సినిమా ‘అఖిల్‌’. ఆ సినిమాతోనే తెరంగేట్రం చేశాడు యంగ్‌ అక్కినేని.. అఖిల్‌. కానీ, ఆ సినిమాతో పరాజయమే దక్కింది. దాంతో, మరో తెలుగు సినిమాలో ఆమె నటించడానికి చాలా చాలా సమయమే పట్టింది. అన్నట్టు, ఈ మధ్యలో ఆమె కొన్ని తమిళ సినిమాలు చేసింది.. ఓ తమిళ హీరోని కూడా పెళ్ళాడేసింది. ఆమె ఎవరో కాదు, సయ్యేషా సైగల్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతోంది.

 

ఆ ఆఫర్‌ నందమూరి బాలయ్య సరసన నటించడమే. బాలయ్య - బోయపాటి డైరెక్షన్‌లో సినిమా కోసం సయ్యేషాని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే, ఈ సినిమాలో ఆమె పాత్ర ఏంటన్నదానిపై భిన్నాభిప్రాయాలు విన్పిస్తున్నాయి. మరోపక్క, ‘బాలయ్య కుమార్తెగా నటిస్తున్నావా.?’ అంటూ ఆమెను విపరీతంగా ట్రోల్‌ చేసేస్తున్నారు నెటిజన్లు. ‘ఎంత కష్టమొచ్చింది నీకు..’ అంటూ ఇంకొందరు మొసలి కన్నీరు కార్చుతున్నారు.

 

సయ్యేషా మాత్రం, బాలయ్యతో నటించే అవకాశం రావడం గొప్ప విషయమని అంటోంది. సయ్యేషా మంచి డాన్సర్‌.. మంచి నటి కూడా. కన్నడలోనూ ఇటీవల ఓ సినిమా చేసింది. తెలుగులోనూ ఆమెకు ఛాన్సులొస్తున్నాయి. అయితే, కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుడడం వల్లే ఎక్కువ సినిమాలు చేయలేకపోతోందట. ఏదిఏమైనా, ట్రోల్స్‌కి గట్టి సమాధానమిచ్చేలా ఆమె బాలయ్యతో సూపర్‌ హిట్‌ కొట్టాలని ఆశిద్దాం.

ALSO READ: Sayyesha Latest Pics