ENGLISH

శంకర్‌ కోసం శంకర్‌ వస్తున్నాడు

07 June 2018-12:57 PM

ఎవరీ ఇద్దరు శంకర్స్‌ అనుకుంటున్నారా? ఆగండాగండి ఒకరు కమెడియన్‌ షకలక శంకర్‌ కాగా, మరొకరు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌. ఇప్పుడు ఓకే కదా. ఇక వివరాల్లోకి వెళితే, ఈ టీవీ 'జబర్దస్త్‌' ప్రోగ్రాం ద్వారా కమెడియన్‌గా మంచి ప్లాట్‌ఫామ్‌ సెట్‌ చేసుకుని, వెండితెరపైనా టైమింగ్‌ ఉన్న కమెడియన్‌గా పలు అవకాశాలతో పాపులర్‌ అయిన షకలక శంకర్‌ కమెడియన్‌ నుండి హీరోగా అవతారమెత్తిన సంగతి తెలిసిందే.

శంకర్‌ హీరోగా తెరకెక్కుతోన్న తొలి సినిమాకి 'శంభో శంకర' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ చేతుల మీదుగా విడుదల చేస్తున్నాడట. ఈ మధ్య కమెడియన్స్‌ హీరోలుగా మారుతున్న సినిమాలకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు ప్రముఖ హీరోలు, డైరెక్టర్ల చేతుల మీదుగా విడుదల చేయిస్తుండడం కొత్త సాంప్రదాయంగా మారింది.

మొన్న కమెడియన్‌ సప్తగిరి సినిమాలను పవన్‌ కళ్యాణ్‌ సహా కొంతమంది హీరోలు అలాగే ఎంకరేజ్‌ చేశారు. షకలక శంకర్‌కి పవన్‌ కళ్యాణ్‌ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్‌ అంటే అంతకు మించిన అభిమానం ఉన్నోడు హరీష్‌ శంకర్‌. ఈ ఇద్దరు శంకరులు పవన్‌ కళ్యాణ్‌ పేరు చెబితే చాలు పూనకమొచ్చినట్లు ఊగిపోయే వాళ్లే. ఈ సంగతి చాలా సార్లు ప్రూవ్‌ చేసుకున్నారు కూడా.

అందుకే పవన్‌ కళ్యాణ్‌కి అత్యంత వీరాభిమాని అయిన శంకర్‌ సినిమా టీజర్‌ని మరో వీరాభిమాని హరీష్‌ శంకర్‌ రిలీజ్‌ చేస్తున్నాడన్న మాట. కమెడియన్‌గా ఆదరణ పొందుతున్న షకలక శంకర్‌ హీరోగా కూడా ఆదరించబడాలని మనస్పూర్తిగా కోరుకుందాం. ఈ సినిమాని జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ: 'మహానటి' చిత్రం ఫై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ చరణ్