ENGLISH

శ్రద్ధా కపూర్‌ స్పెషల్‌ సాంగ్‌?

28 January 2021-15:00 PM

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిన శ్రద్ధాకపూర్‌, 'సాహో' సినిమాతో టాలీవుడ్‌ జనాలనీ పలకరించింది. అయితే, 'సాహో' ఆశించిన రేంజ్‌ సక్సెస్‌ అందుకోలేకపోయింది. అది వేరే సంగతి. మరో మారు టాలీవుడ్‌లో శ్రద్ధాకపూర్‌ పేరు వినిపిస్తోంది. ఓ తెలుగు సినిమా కోసం శ్రద్ధాకపూర్‌తో మంతనాలు చేస్తున్నారట. అది ఓ పెద్ద హీరో సినిమా అనీ తెలుస్తోంది.

 

అయితే, హీరోయిన్‌గా కాదట. స్పెషల్‌ సాంగ్‌ కోసమనీ తెలుస్తోంది. ఇంతకీ ఎవరా పెద్ద హీరో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు తెలుగులో పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటించేందుకు శ్రద్ధా కపూర్‌ ఇంట్రెస్ట్‌ చూపడం లేదట. ఇప్పటికే కొందరు టాలీవుడ్‌ దర్శక దిగ్గజాలు శ్రద్ధా కపూర్‌ని సంప్రదించడం జరిగిందట. కానీ, ఒక్క సినిమాకీ సైన్‌ చేయలేదట. కానీ, ఆ హీరోతో స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి మాత్రం శ్రద్ధా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

ఒకవేళ ఆ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌నా.? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, అది ప్రబాస్‌ కాదని మరికొందరు అంటున్నారు. వాస్తవానికి మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, బాలయ్య తదితర అగ్ర హీరోలు ప్రస్తుతం తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న సంతి తెలిసిందే. బహుశా వీరెవరితోనైనా స్పెషల్‌ స్టెప్పులు వేసేందుకు శ్రద్ధా కపూర్‌ సిద్దమవుతోందా.? వేచి చూడాలిక.

ALSO READ: Shraddha Kapoor Latest Photoshoot