ENGLISH

పెళ్ళికి ముందే అని షాక్ ఇచ్చిన శృతి?!

26 May 2017-12:31 PM

శృతి హాసన్ ఎంత మోడరన్ గా ఉంటుందో అంతే మోడరన్ గా ఆలోచిస్తుంది అనేదానికి తను ఈ మధ్యనే ఇచ్చిన ఒక బోల్డ్ సమాధానమే ఇందుకు ఉదాహరణ.  

వివరాల్లోకి వెళితే, కొన్ని రోజులుగా శృతి హాసన్ కి ఒక సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని, అలాగే అతన్ని త్వరలోనే పెళ్లాడబోతుంది అన్నట్టు పుఖార్లు షికారు చేసాయి. దీనిపై స్పందిస్తూ, తనకి ఎవరితోనో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని. తనకి ఆ ఆలోచన వస్తే నిరభ్యంతరంగా అందరికీ చెబుతానని తెలిపింది.

ఇక ఇదే సమయంలో తనకి అన్ని విధాలా నచ్చినవాడు దొరికితే, పెళ్ళికి ముందే తల్లి అవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి షాక్ ఇచ్చింది.

ఇప్పటికే శృతి పెళ్లి విషయం లో శృతి నిర్ణయానికే తాను ఓటు వేస్తానని చెప్పి కమల్ తన భావాన్ని క్లియర్ చేసేశాడు. చూద్దాం.. శృతి ఇటువంటి సంచలన వ్యాఖ్యలకు రూపం ఇస్తుందా లేదా అనేది.

ALSO READ: దంగల్ కి చైనాలోనే ఎక్కువ వచ్చాయంట